ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఇవే

దేశంలో లాక్ డౌన్ పొడిగింపుతో చాలా మంది చతికిలపడ్డారు. గత 22 రోజులుగా ఇళ్ళకే పరిమితమై కనీసం ఏప్రిల్ 15 నుంచైనా సాధారణ జీవితం గడుదామనుకున్న సామాన్యుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనతో నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే.. 21 రోజుల తర్వాత లాక్ డౌన్ ఒకేసారి ఎత్తేస్తే పరిస్థితి ఏంటి ? అసలే ఓ వైపు కొన్ని చోట్ల వైరస్ పాజిటివ్ కేసులో పెద్ద ఎత్తున నమోదవుతూనే వున్నాయి. వైరస్ ప్రభావం లేని ప్రాంతాలకు కూడా విస్తరిస్తే పరిస్థితి ఏంటి ? ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రధానమంత్రి. అయితే, లాక్ డౌన్ నుంచి ఎగ్జిట్ ఎలా? దీనికి తొలి అడుగు పడేది ఏప్రిల్ 20వ తేదీ నుంచే అని ప్రధాని చెప్పకనే చెప్పారు. అన్నట్లుగానే బుధవారం ఏప్రిల్ 20వ తేదీ నుంచి లభించనున్న సడలింపులను కేంద్రం లీక్ చేసింది. ఈ లీకేజీల ప్రకారం కొన్ని సెలెక్టెడ్ యాక్టివిటీస్ ఏప్రిల్ 20వ తేదీనుంచి అనుమతించనున్నారు.

All you need to know about the GST e-way bill system
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

దేశంలో అన్ని రకాల గూడ్సు రవాణా వ్యవస్థలను ఏప్రిల్ 20వ తేదీ నుంచి కేంద్రం అనుమతించనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ సంబంధ పనులు, వ్యవసాయోత్పత్తులన మార్కెటింగ్ కార్యకలాపాలను అనుమతించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం సిబ్బందితో వర్క్ అనుమతిస్తారు. అయితే సామాజిక దూరాన్ని విధిగా పాటించాల్సి వుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు చేసుకోవచ్చు. కానీ వారికి శుభ్రమైన వాతావరణం కల్పించాలి. సామాజిక దూరాన్ని పాటించాల్సి వుంటుంది. సాగునీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణ పనులను కూడా ఏప్రిల్ 20వ తేదీ నుంచి అనుమతించబోతున్నారు. అదే సమయంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 3వ తేదీ దాకా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, హాస్పటాలిటీ సర్వీసెస్, ఎయిర్, రోడ్డు, రైల్ పాసెంజర్ సర్వీసులు, అన్నిరకాల సోషల్ గ్యాదరింగ్స్, అన్నిరకాల విద్యాసంస్థలు, అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, ప్రధాన నగరాల్లో మెట్రో రైల్ సర్వీసులపై లాక్ డౌన్ కొనసాగుతుంది.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

అలాగే వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు అనుమతిచ్చారు. వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవు. ఉపాధి హామీ పనులు, భవన నిర్మాణ పనులకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతిచారు. ఎరువులు, పరుగుల మందులు, విత్తనోత్పత్తి దుకాణాలు తెరిచేందుకు అనుమతిచారు. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించవచ్చు. విద్యాసంస్థలు కార్యకలాపాలు నిర్వహించవద్దని పేర్కొంది..ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా ఉండనున్నాయి. సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం, పెద్ద ఎత్తున ప్రార్థనలు నిలిపివేత, ట్యాక్సీ సర్వీసులకు అనుమతి నిరాకరణ. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వెయ్యనున్నారు.

Content above bottom navigation