ప్రపంచ దేశాలు జపాన్ ను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు

121

ఒక దేశాన్ని ఆదర్శంగా తీసుకుని, మన దగ్గర లేని కొన్ని పద్ధతులు వేరే దేశాలు ఏమైనా పాటిస్తున్నాయా? లేదా ఆయా దేశాలకు తమదైనటువంటి గొప్ప పద్ధతులు ఏమైనా ఉన్నాయా అంటే, అది ఖచ్చితంగా జపాన్ అనే చెప్పాలి. ఇతర దేశాల నుంచి ఎన్నో బాంబు దాడులు జరిగినా, వాటిని ఎదుర్కొని, వాటిని తట్టుకుని లేచి, అతి తక్కువ కాలంలోనే తమదైన అభివృద్ధిని సాధించి, మేము డెవలప్ కు గొప్ప ఉదాహరణ అని చూపించిన ఘటన జపాన్ ది. సూర్యుడు ఉదయించే దేశంగా పేరుగాంచిన జపాన్, ప్రపంచంలో 10 అతిపెద్ద దేశాల లిస్ట్ లో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. నాణ్యత, టెక్నాలజీ, పారిశ్రామికీకరణ, కట్టుబాట్లు, ఆచార సంస్కృతి, సంప్రదాయాలకు కూడా జపాన్ పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే అనేక నియమాలతో. ఇతర ప్రపంచ దేశాలకు ఉదాహరణగా, తాము మాత్రమే కలిగి ఉండి. ఇతర దేశాలు చూసి నేర్చుకోవాల్సిన కొన్ని టెక్నీకల్ వాల్యూస్ తో పాటు పద్ధతులు, ప్రాముఖ్యతల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for japan schools rules
 1. ఇన్నోవేటివ్ పార్కింగ్ గ్లాస్…
  మన దగ్గర మన జనాభాను బట్టి కారు పార్కింగ్ అనేది అతిపెద్ద సమస్య. జపాన్ లో కూడా ఈ సమస్య ఉండేది కానీ వారు ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ, తమ మేధస్సును ఉపయోగించి కొన్ని పార్కింగ్ లార్డ్స్ ను క్రియేట్ చెయ్యడం జరిగింది. ఈ ప్రాబ్లమ్ అక్కడి షాపింగ్ మాల్స్ లలో ఉండడంతో, తక్కువ స్థలాన్ని వాడుతూ, టెక్నాలజీని ఉపయోగించి, అంతస్థుల వారీగా కారు పార్కింగ్ లార్డ్స్ ను ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టడం జరిగింది.
 2. హాస్పిటల్ ఫుడ్…
  జపాన్ లో హాస్పిటాలిటీ చాలా కేరింగ్ గా ఉంటుంది. ఎవరైనా రోగులు గానీ, ప్రెగ్నెంట్ లేడి గానీ వచ్చినప్పుడు, వారికి ఇచ్చే ఆహారం చాలా పరిశుభ్రంగా, ఆరోగ్య కరంగా ఉంటుంది. హోస్పిటల్ ఫుడ్ అనేది డైట్ ఫుడ్ కన్నా క్లీన్ గా ఉంటుంది. అక్కడ లభించే అత్యంత ఆరోగ్యకరమైన కూరగాయలు గానీ,మాంసాన్ని కనీసం రంగులు కూడా కలపకుండా, కేవలం ఆహారపదార్థాలను ఉడకబెట్టి రోగులకు అందించడం జరుగుతుంది. ఇక్కడ పొరబాటున హాస్పిటల్ సిబ్బంది ఫుడ్ విషయంలో ఏ చిన్న తప్పు చేసినా, ఉద్యోగం పోవడమే కాదు, దానికి తగిన జరిమానా కూడా విధిస్తారు.అందుకే జపాన్ హాస్పిటల్ ఫుడ్ నెంబర్ 1 అని చెప్పవచ్చు.
Image result for japan schools
 1. టెక్నీకల్ అంబ్రీల్లా..
  వర్షం పడ్డప్పుడు అన్ని దేశాలలో తిరిగినట్టే జనాలు గొడుగులు వేసుకుని తిరుగుతారు. అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే… వీళ్ళు వేసుకునే గొడుగులో అంచున ఒక ప్లాస్టిక్ కవర్ ఉండి, అది పొడవునా తన చుట్టూ మాత్రమే కాకుండా, కింద వరకు వ్రేలాడుతూ, వర్షం ఎటునుంచి వీస్తున్న తడవకుండా ఉంటుంది. మార్కెట్ లో మాములు గొడుగులు దొరికినప్పటికీ, ఇటువంటి పూర్తీ రక్షణాత్మక గొడుగులా కోసం మాత్రం , అక్కడ రిటైల్ మార్కెట్ లో ప్రత్యేకమైన మిషన్ తో ప్లాస్టిక్ కవర్ అటాచ్ మెంట్ లభిస్తుంది.
 2. స్కూల్ సిస్టమ్…
  మన దగ్గర సాధారణంగా స్కూల్ స్టూడెంట్స్ స్కూల్ కు వెళ్లి, లెసన్ నేర్చుకున్నామా, వచ్చామా అన్నట్టు ఉంటారు. కానీ జపాన్ లో అలా కాదు.పాఠశాలలో చదువుకోవడంతో పాటు, అక్కడ విద్యార్ధి విద్యార్థినిలు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే క్లాస్ రూమ్ ను క్లీన్ గా తుడవడం, బెంచ్ లను శుభ్రంగా చెయ్యడం, ఆ స్టూడెంట్స్ బాధ్యతగానే ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజన సమయంలో కూడా వాళ్ళు పాటించే నియమాలు, ఏ ఇతర దేశాల వాళ్ళు పాటించరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ క్రింది వీడియో చూడండి

 1. హాట్ హగ్స్..
  వర్షాకాలంలో కానీ, శీతాకాలంలో కానీ చలివేసినప్పుడు జపాన్ లోని చిన్నపిల్లలు హాట్ హగ్ టాయ్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇంతకు హాట్ హగ్స్ అంటే ఏమిటంటే.. అక్కడ పంట పొలాల్లో లభించే సువాసనను వెదజల్లే కాటన్ ను డాల్స్ లలో పెట్టి, దానిని మైక్రో వేవెన్స్ లో పెట్టి 60 సెకండ్ వేడి చేస్తే, అది సువాసనను వెదజల్లుతూ, పిల్లలకు రక్షణ ఇవ్వడంతో పాటు, ఆహ్లాదకరంగా ఉండేలా చూస్తుంది. ఇది కేవలం జపాన్ లో మాత్రమే కనిపించే విశేషం .
 2. డేటింగ్…
  మనకు అమెరికా లాంటి పాశ్చాత్త దేశాలలో డేటింగ్ అనేది ఎంతలా ఉంటుందో మనం సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. కానీ జపాన్ లో డేటింగ్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అమ్మాయిలకు అయితే మరింత కఠినంగా ఉంటాయి. ఎవరితో పడితే వాళ్ళతో తిరగడం, విచ్చలవిడి తనానికి వ్యతిరేకంగా ఉంటుంది జపాన్ ప్రభుత్వం.

ఇలా కొన్ని విషయాలు జపాన్ ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలి. మరి జపాన్ లో ఉన్న ఈ విషయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation