దేవుడికీ కరోనా వైరస్? గుడిలో శివలింగానికి మాస్క్ పెట్టిన పూజారి

114

కరోనా వైరస్ పై ఇండియాలో భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల వల్ల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే, మనం ఇప్పటివరకు మనుషులకు కరోనా వైరస్ సోకుతుందనే విషయం గురించే తెలుసు. దేవుళ్లకు కూడా ఈ వైరస్ సోకుతుందా? ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉండవచ్చు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ గుడికి వెళ్తే మాత్రం మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఓ పూజారి శివలింగానికి మాస్క్ తొడిగి పూజలు చేస్తున్నాడు. ఇది చూసిన భక్తులు దేవుడికి మాస్క్ పెట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. దేవుడే అందరికీ రక్షణ కల్పిస్తాడు కదా.. అలాంటి దేవుడికి మాస్క్ ఎందుకు అని ప్రశ్నిస్తే ఆ పూజారి అందరికీ ఉపయోగపడే ఓ మంచి విషయం చెప్పాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతుంది.. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాశీలోని ప్రహ్లాదేశ్వర్ ఆలయంలోని పూజారి కృష్ణ ఆనంద్ పాండే శివలింగానికి సైతం మాస్క్ తొడిగి పూజలు అర్పిస్తున్నాడు ఒక పూజారి. ఎందుకిలా చేశావని అడిగితే… చలికాలంలో దేవుళ్లకు వస్త్రాలు కప్పుతాం. వేసవిలో దేవుడికి ఉక్కపోయకుండా ఫ్యాన్ పెడతాం. అలాగే ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ అందరికీ వ్యాపిస్తుంది కాబట్టి దేవుడికీ సోకకుండా మాస్క్ పెట్టాను అని ఆలయ పూజారి ఆనంద్ పాండే తెలిపారు. శివ లింగానికి మాస్క్‌ ను చూడగానే భక్తులు ఆశ్చర్యంగా తనని చూస్తున్నారని, అసలు విషయం తెలిసిన తర్వాత మంచి ఆలోచన అని ప్రశంసిస్తున్నారని పాండే పేర్కొన్నాడు. శివలింగానికి మాస్క్ పెట్టేడమే కాదు.. ఆలయానికి వచ్చే భక్తులకు కొన్ని నిబంధనలు కూడా పెట్టాడు. ఆలయంలోకి వస్తున్న భక్తులను శివ లింగాన్ని ముట్టుకోవద్దని పాండే కోరుతున్నాడు.

Image result for దేవుడికీ కరోనా వైరస్?

ఆలయం పరిసరాల్లో కరోనా వైరస్ మీద అవగాహన కల్పిస్తూ, పోస్టర్లు కూడా అతికించాడు. భక్తులను శివ లింగాన్ని తాకవద్దని కోరుతున్నాడు. వైరస్ ఉన్న వ్యక్తులు శివ లింగాన్ని తాకినట్లయితే, అది ఆ తర్వాత వచ్చే భక్తులకు సోకే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆంక్షలు విధించాల్సి వచ్చింది. అంతేకాదు ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలని కూడా కోరుతున్నాం’’ అని తెలిపారు. ఏది ఏమైనా ఈ పూజారి గారి ముందు చూపుకు సలాం కొట్టాల్సిందే కదూ.. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అందరు కూడా పాజిటివ్ గానే కామెంట్స్ పెడుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation