వీడు మాములు దొంగ కాదు..ప్రయాణికులతో సహా బస్సు దొంగిలించాడు..చివరకు ఏం చేశాడంటే

చోరీల్లో కెల్లా ఈ చోరీ రికార్డుకి ఎక్కింది అనే చెప్పాలి..ఎవ‌రైనా బైక్ కారు దొంగ‌త‌నం చేసేవారు ఉంటారు, బంగారం దొంగిలించే వారు ప‌ర‌సు కొట్టేసేవారు ఉంటారు..కాని ఇక్క‌డ ఏకంగా ఓ వ్య‌క్తి ఆర్టీసీ బ‌స్సునే దొంగ‌త‌నం చేశాడు, అస‌లు ఎలా ఇలా దొంగిలించాడో తెలిస్తే నిజంగా మ‌తిపోతుంది.వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ గుర్తు తెలియని దుండగుడు ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సు ఎత్తుకెళ్లి.. బస్సు డ్రైవర్, కండక్టర్‌కు షాకిచ్చాడు. బస్సును ర్యాష్‌గా నడుపుతుండటంతో.. ఈ డ్రైవింగ్ ఏంటని ప్రయాణికులు నిలదీశారు. దీంతో తాండూరు శివార్లలో బస్సును రోడ్డు మీదే ఆపేసి పరారయ్యాడు. దీంతో బస్సులో ఉన్నవారంతా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాండూరు డిపోకు చెందిన ఈ బస్సు తాండూరు సమీపంలోని కరోన్‌కోట్ నుంచి ఓగిపూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

బస్టాండ్‌లో బస్సును ఆపిన డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లి తిరగొచ్చే సరికి బస్సు మాయమైంది. సెక్యూరిటీ సిబ్బంది బస్సు కోసం వెతికినా కనిపించలేదు. బస్సును పట్టణ శివార్లలో ఓ వ్యక్తి ఆపేశాడని ప్రయాణికుడొకరు సమాచారం ఇచ్చారు. వెంటనే డ్రైవర్‌ను, కండక్టర్‌ను పంపించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన ఇదే తొలిసారి కానప్పటికీ.. ప్రయాణికులతో సహా బస్సును ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం మాత్రం ఇదే మొద‌టిసారి. గతంలో హైదరాబాద్‌లో కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో బస్సును గౌలిగౌడ నుంచి ఇద్దరు దుండుగులు ఎత్తుకెళ్లారు.

ఈ క్రింది వీడియో చుడండి

దాన్ని మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో ఉన్న స్క్రాప్ షాప్‌కి అమ్మేశారు.. బస్సు ఆనవాళ్లు లేనంతగా పార్టులు పార్టులుగా విడగొట్టారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా బస్సు వెళ్లిన మార్గాన్ని గుర్తించి, దుండగులను పట్టుకున్నారు. ఈ ఘటనలు ఆర్టీసీలో సెక్యూరిటీ వైఫల్యాన్ని కళ్లకు కడుతున్నాయి.ఇక ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న డిపో మేనేజర్ బస్సును తిరిగి డిపోకు తరలించారు. డిపో మేనేజర్ ఫిర్యాదుతో.. సీసీ ఫుటేజీ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించామని పోలీసులు తెలిపారు. బస్సును దొంగతనంగా తీసుకెళ్లిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation