తొలిరాత్రి గురించి ఇలా ఆలోచిస్తే ఇక అంతే సంగతులు..

206

తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాక…ఇలాగే ఉంటుందా తొలిరేయి అన్నది..అలా అలా మనసు తేలిపోతుంది..ఇది తొలిరాత్రి..కదలని రాత్రి..అర్జున్ కు తెలుగు సినిమాల్లోని తొలిరాత్రి పాటలన్నీ కంటతా వచ్చు..ఏ డైరెక్టర్ ఆ దృశ్యాన్ని ఎలా చిత్రీకరిస్తాడు అనేది పక్కాగా చెప్పేస్తాడు.. మూడ్ వచ్చినప్పుడల్లా ఆ పాటలే పాడేస్తాడు..ఆ దృశ్యాలు ఊహించుకునే వాడు..ఇది ఈ నాటి కధ కాదు..కౌమారం లోకి అడుగుపెట్టగానే తొలి రాత్రి ఊహలు కళ్ళలోకి ప్రవేశించాయి..ఒక చిత్రం లోంచి ఓ సీను మరో చిత్రం లోంచి ఇంకో సీను కట్ అండ్ పేస్ట్ చేసి తన తొలిరాత్రి ఎలా ఉండాలన్న విషయంలో పక్కాగా స్క్రిప్త్ సిద్దం చేసుకున్నాడు..ఆ ఊహల మధ్యే డిగ్రీ అయిపోయింది..పిజి కూడా పూర్తయింది ..పోటీ పరీక్షలు రాసి మంచి ఉద్యోగమే తెస్సుకున్నాడు..ఇక పెళ్ళి చూపుల తతంగం మొదలయింది..చాలా సంబందాలే వచ్చాయి..ఎత్తు తక్కువనో రంగు తక్కువనో ఉద్యోగం నచ్చలేదనో ఏదో వంకతో నో చెప్పేవాడు..అసలు కారణం మాత్రం ఆ అమ్మాయిలెవరూ తన తొలిరాత్రి కలల్లోని హీరోయిన్ లా లేకపోవడమే..నీ పెళ్ళి మా తద్దినానికి వచ్చిందంటూ తల్లి దండ్రులు చేతులెచ్చేసే పరిస్థితి వచ్చేసింది…

Image result for marriage

అంతలోనే సుప్రజ సంబందం వచ్చేసింది..అమ్మాయి చదువుకుంది..చక్కగా పాడుతుంది..అన్నిటికీ మించి అందగత్తె..అందులోనూ తన కలల రాణి పోలికలు ఉండడంతో అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..పెళ్ళి ఘనంగా జరిగింది..మంచి ముహూర్తం చూసి తొలిరాత్రి ఏర్పాటు చేసారు..గది అలంకరణ విషయంలో తనే సూచనలు ఇచ్చాడు.. పాత సినిమాల్లోలా పట్టెమంచం కావాలన్నాడు..గులాబీలు మల్లెలు బుట్టల కొలదీ తెప్పించాడు..అత్తరు పరిమళాలు గుప్పించాడు..తెల్ల చీర తెల్ల ధోతి స్వయంగా తెప్పించాడు..ఆ రోజు రానే వచ్చింది…అరగంట ముందే శోభనం గదిలోకి వెళ్ళి కూచున్నాడు.. సిగ్గు మొగ్గవతూ ఆమె గదిలోకి అడుగు పెడుతుంది..తను ఎదురుగా వెళ్ళి పట్టె మంచం దగ్గరికి తీసుకొని వచ్చాడు..ప్రేమగా పాలగ్లాసు నోటి దగ్గర పెడుతుంది..తనూ ఒక గుక్క తాగి ఆమెతోనూ తాగిస్తాడు..ఆమె పెదాల మీద అంటుకున్న మీగడను తన పెదాలతో..కట్ కట్ కట్ అలా ఏమీ జరగలేదు..అమ్మాయి పాలగ్లాసు తీసుకు వచ్చింది..చికాకుగా చికాకుగా టేబుల్ మీద పెట్టింది..అబ్బా ఉక్కపోతగా ఉందని విసుక్కుంది..కొంచెం కూడా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ లేదు..అనుకున్నదొకటి అయినది ఒకటి…బోల్తా కొట్టిన బుల్ బుల్ పిట్ట అయిపోయాడు అర్జున్..

ఈ క్రింది వీడియో చూడండి

మిగతా కార్యక్రమమైనా స్క్రీన్ ప్లే ప్రకారం నడిపించాలనుకున్నాడు..అక్కడా నిరాశే…మొగుడు చెయ్యి వేయగానే కొత్త పెళ్ళాం తమకంతో కళ్ళుమూసుకోవాలి కదా..మూసుకోలేదు..ఆబగా హత్తుకుపోవాలి కదా… హత్తుకుపోలేదు.. రెచ్చిపోవాలి కదా..రెచ్చిపోనూలేదు..మొహమాటం మొహమాటంగా దగ్గరకు వచ్చింది..ఆ తరువాత కార్యక్రమం ఊహించినంత థ్రిల్ గా ఏమీ లేదు..జాగరం చెయ్యాలన్న కోరిక నెరవేరలేదు..అరగంటలోపే అలసటగా తల వాల్చాడు..ఊహలు వేరు..వాస్తవాలు వేరు..చూసే సినిమాలు చదివే కధలు వినే కబుర్లు మనసును పక్కదారి పట్టిస్తాయి..కలలు విహరింపు జేస్తాయి…వాస్తవంలో అలా జరగకపోయే సరికి నిరాశ పడిపోతాం..దీని వలన మనం సంతోషంగా ఉండలేము..జీవిత భాగస్వామిని సంతోష పెట్టలేము..మనుషుల బట్టి పెరిగిన వాతావరణం బట్టి ఆలోచనలు ఉంటాయి..మనం ఆలొచినట్టే జీవిత భాగస్వామి ఆలోచించాలని లేదు..మనలోని భావుకతే ఆమె లో ఉండాలని ఎక్కడా రాసిపెట్టిలేదు..జీవితం పట్ల జీవన సహచరి పట్ల అంచనాలు ఉండడంలో తప్పులేదు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation