ఈ అమ్మాయి ప్రపంచంలోనే అందరి కన్నా దురదృష్టవంతురాలు…

పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రేమతో పెద్దవుతారు. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతారు. కానీ పిల్లలందరూ ఇలా పెరగరు. కొందరి జీవితంలో బాధ మాత్రమే ఉంటుంది. అసలు ఆనందం అంటే ఏమిటీ, ఆనందం అనేది ఒకటి ఉందా అనే విషయం కూడా కొంతమందికి తెలీదు. అలాంటి ఒక పాప గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆమె బాల్యం మొత్తం ఎంతో బాధతో ఎంతో భయంకరంగా గడిచింది. ఒక 12 ఏళ్ళు ఆమె బయటి ప్రపంచాన్ని చూడకుండా, చిమ్మ చీకటి ఉన్న గదిలో ఉందంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం. మరి ఆమె గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for fearing girl

ఆమె పేరు జెన్నీ విల్లి. ఆమె అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించింది. జెన్నీ తన బాల్యం అంతటిని ఒక చీకటి గదిలో గడిపింది. ఆమె తండ్రి ఆమెను బయటప్రపంచానికి కనపడకుండా ఆమెను ఒక చీకటి గదిలో దాచిపెట్టాడు. రోజు టార్చర్ పెడుతూ విపరీతంగా కొట్టేవాడు. 1977 లో ఒక రెస్క్యూ టీమ్ ఆమెను కాపాడినప్పుడు పాపం ఆమెకు మాట్లాడటం కూడా రాదు. డాక్టర్స్ ఆమెను ఏమైనా నేర్పించాలని చాలా ట్రై చేశారు. కానీ జెన్నీ మాట్లాడలేకపోయింది. ఈమె కథలో బాధాకర విషయం ఏమిటంటే.. ఆమె సొంత కుటుంబ సభ్యులే ఆమెను ఇలా బంధించారు. దీంతో ఆమె బాల్యం మొత్తం స్ట్రెస్, కన్ఫ్యూజన్ తో గడిచిపోయింది. అయితే ఈమెకు పేరు కూడా ఏమి లేదు. ఆమెను కాపాడినప్పుడు రెస్క్యూ టీమ్ వాళ్ళే, ఆమెకు జెన్నీ అని పేరు పెట్టారు. జెన్నీ తండ్రి ఆమె పుట్టకముందే అతని ఉద్యోగాన్ని వదిలేశాడు. అతను తన కుటుంబాన్ని ప్రపంచానికి కనపడకుండా దాచి ఉంచేవాడు. అతను ఫ్రీగా ఉన్నప్పుడు అతను తన కోపాన్ని పిల్లల మీద చూపేవాడు. ఎక్కువగా జెన్నీ పైన చూపేవాడు.

Image result for girls harassment

ఏదో ఒక సిచువేషన్ ను క్రియేట్ చేసి దారుణంగా హింసించేవాడు. అతను ఆ పాపను బయటి ప్రపంచానికి మాత్రమే కాదు తన కుటుంబానికి కూడా కనపడకుండా ఉంచేవాడు. జెన్నీని బేస్ మెంట్ కింద ఉంచేవాడు. అక్కడికి కనీసం ఒక సూర్యకిరణం కూడా చేరేది కాదు. జెన్నీకి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆమెను బంధించాడు. 11 సంవత్సరాలు అలాగే ఉంచాడు. ఈ 11 ఏళ్లలో ఆమెకు సరిగ్గా తిండి కూడా పెట్టేవాడు కాదు. ఆకలితో ఆమె గట్టిగా అరిచేది. దాంతో కోపం వచ్చి బేస్ బాల్ బ్యాట్ తో ఆమెను కొట్టేవాడు. అతను పెట్టినప్పుడే తిండి తినాలి అని హెచ్చరించేవాడు. ఆకలి అంటే ఏమిటో, దానిని ఎలా తీర్చుకోవాలో కూడా జెన్నీకి తెలీదు. అయినా సరే కడుపులో మంట వేస్తే ఆమె గట్టిగా అరిచేది. వాళ్ళ నాన్న ఆమెకు తిండి పెట్టినప్పుడు, ఎలా తినాలో కూడా ఆమెకు తెలిసేది కాదు. అప్పుడు ఆమె నాన్న ఆ ఫుడ్ ను నోట్లో కుక్కితే ఆమె తినేది. 12 ఏళ్ల వయసులోనే జెన్నీ ఇంతటి నరకాన్ని అనుభవించింది. ఈ వయసులో పిల్లలు కొత్త బట్టలు, ఫ్రెండ్స్, బర్త్ డే పార్టీల గురించి ఆలోచిస్తారు. కానీ జెన్నీ అంత లక్కీ గర్ల్ కాదు. ఆమెకు స్నానం అంటే ఏంటో తెలీదు. కొన్ని వారాల పాటు ఆమెను టాయిలెట్ సీట్ మీద కట్టేసి ఉంచేవాడు. ఇలా ఎన్నో బాధలు అనుభవించింది.

Image result for girls harassment

ఇప్పడూ జెన్నీ తల్లి గురించి మాట్లాడుకుందాం. జెన్నీ తండ్రి మొదట జెన్నీ తల్లినే కొడుతూ టార్చర్ పెట్టేవాడు. ఆమెను ఇల్లు దాటి బయటకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. జెన్నీకి ఇంకా ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉంది. అందరి కంటే జెన్నీ చిన్నది. జెన్నీ అక్క పుట్టినప్పుడు ఆమె ఏడిస్తే బయట చలిలో వదిలేసేవాడు. దీంతో ఆమెకు నిమోనియా వచ్చి ఒకరోజు చనిపోయింది. ఆ తర్వాత ఒక బాబు పుట్టాడు అతను కూడా రెండేళ్లకే చనిపోయాడు. తర్వాత మరొక పిల్లడు పుట్టాడు కానీ ఇతను బతికిపోయాడు. ఎందుకంటే ఆ పిల్లాడిని వాళ్ళ తాతయ్య వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇక చివర్లో జెన్నీ తన తండ్రి టార్చర్ ను భరించడానికే ఏ భూమి మీదకు వచ్చింది. జెన్నీ తల్లి కూడా ఆమె బిడ్డ కోసం ఏమి చెయ్యలేకపోయింది. ఆమె ఏమైనా ప్రయత్నం చేస్తే ఆమె భర్త ఆమెను దారుణంగా కొట్టేవాడు హింసించేవాడు. ఆమె సీక్రెట్ గా తన బిడ్డకు ఫుడ్ పెట్టేది కానీ ఆ పాప ఆ ఫుడ్ ను తినేది కాదు. ఇక ఒకరోజు జెన్నీ తల్లి ఇప్పటివరకు పడింది చాలు. ఇక ఆపేయాలని అనుకుంది. జెన్నీ తండ్రి బయటకు వెళ్ళినప్పుడు జెన్నీని తీసుకుని వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ కు పరుగెత్తింది. జెన్నీ తండ్రికి ఈ విషయం తెలియగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. జెన్నీని లాస్ ఏంజిల్స్ లో ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆమె చాలా వీక్ గా ఉంది. ఆమె బరువు కూడా చాలా తక్కువగా ఉంది. 13 ఏళ్ల వయసులో కూడా ఆమెకు నడవడానికి వచ్చేది కాదు. డాక్టర్స్ ఆమెకు ఏమైనా తినిపిద్దాం అని చూసినా ఆమెకు నమలడం రాదు. ఆమె దానిని డైరెక్ట్ గా మింగేసేది. స్నానం ఎలా చెయ్యాలో, టాయిలెట్ ఎలా యూస్ చెయ్యాలో ఆమెకు తెలిసేది కాదు. ఆమెకు ఏమైనా తెలిసింది అంటే అది ఒక పదం అనడం. అదే సారి. ఇది కూడా ఆమె తండ్రి చెప్పి ఉంటాడని, సారి అని చెప్పు అని ఆమె తండ్రి కొట్టేటప్పుడు చెప్పి ఉంటాడని డాక్టర్స్ అనుకుంటున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

డాక్టర్స్ జెన్నీ బ్రెయిన్ యొక్క కాగ్రటి ఎబిలిటీస్ చెక్ చేసి, ఆమె బ్రెయిన్ సంవత్సరం వయసు ఉన్న పిల్లల బ్రెయిన్ ఉన్నట్టే ఉందని చెప్పారు. అంటే ఆమె ఆలోచన, అర్థం చేసుకునే శక్తి కేవలం సంవత్సరం వయసున్న పసిపాపలాగే ఉండిపోయింది. ఇంత డ్యామేజుడ్ చైల్డ్ ను ఎప్పుడు చూడలేదని డాక్టర్స్ చెప్పారు. ఎంతోమంది డాక్టర్స్ ఆమెకు రకరకాల టాస్క్ లు ఇచ్చి ఆమెకు ఏదో ఒకటి నేర్పించాలని ట్రై చేశారు. అంటే స్నానం ఎలా చెయ్యాలి, లెటర్స్, నెంబర్స్.. ఇలా అన్ని నేర్పించాలని ట్రై చేశారు కానీ ఆమె నేర్చుకోలేకపోయింది. అయితే కొద్దిరోజులకు ఆమెకు మెల్లగా మాట్లాడటం వచ్చింది. అప్పుడు ఆమెను అడిగితే తన తండ్రి ఆమెను కొట్టేవాడని, నేను ఏడ్చేదానిని అని మాత్రమే చెప్పింది. జెన్నీ పెరిగేకొద్దీ డాక్టర్స్ ఆమెను అబ్సర్ వేషన్ లో ఉంచారు. కానీ ఒకరోజు డాక్టర్స్ జెన్నీ తల్లిని పిలిచి, జెన్నీ మాట్లాడే ఎబిలిటీని కోల్పోయిందని చెప్పారు. మేము ఏమి చేయలేమని చెప్పేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation