చిరంజీవి, సురేఖల పెళ్లికి ఆ హీరోయినే కారణం..

చిరంజీవి భార్య సురేఖ గురించి మన అందరికి తెలుసు. అల్లు రామలింగయ్య కూతురు అయినా సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత చిరంజీవి దశ తిరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె వలనే తనకు అదృష్టం కలిగిందని సాక్షాత్తు చిరంజీవి చాలాసార్లు చెప్పాడు. తన జీవితంలో రెండుసార్లు ఆ దేవుడు నాకు గిఫ్ట్స్ ఇచ్చాడని ఒకటి తాను హీరో అవ్వడం రెండు సురేఖా తనకు భార్యగా రావడం అని మెగాస్టార్ భావిస్తుంటారు. సురేఖా గురించి చిరంజీవి ఇంతలా పొంగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అల్లు రామలింగయ్య కూతురిగా పెరిగిన సురేఖా చిరంజీవిని పెళ్లి చేసుకుని కొణిదెల వారి కోడలిగా అడుగుపెట్టింది. ఇంటికి పెద్ద కోడలిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. మరి ఇంత మంచి భార్య చిరంజీవికి దొరకడానికి కారణం ఎవరో తెలుసా? చిరంజీవికి సురేఖతో పెళ్లి కావడానికి ఒక హీరోయినే కారణమట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. వాళ్ల వివాహానికి పరోక్షంగా నిలిచిన సీనియర్ హీరోయన్ రాజశ్రీ.

Image result for చిరంజీవి, సురేఖల పెళ్లి

తాజాగా ఈ సీనియర్ కథానాయిక.. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి తన సినీ ప్రస్థానంతో పాటు హీరోయిన్‌గా తన కెరీర్ విషయాలు.. పెళ్లి.. కుటుంబానికి సంబంధించిన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. చిరంజీవి పెళ్లి కావడానికి నేనే సాయం చేసానంటూ ప్రస్తావించారు. తనకు చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో అందరికంటే అల్లు రామలింగయ్య కుటుంబంతో మా ఫ్యామిలీకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. వాళ్లు పిల్లలతో కలిసి నేను చిన్నపుడు ఆడుకునే దాన్ని అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రాజశ్రీ. ఒకసారి ‘అత్తను దిద్దిన కోడలు’ సినిమా షూటింగ్ సందర్భంగా అల్లు రామలింగయ్య గారు వచ్చి కొత్తగా ఇండస్ట్రీలో ఒక కుర్రాడు వచ్చాడు. చాలా బాగుంటాడు. డాన్సులు, ఫైట్స్ కూడా బాగానే చేస్తున్నాడు. మా అమ్మాయి సురేఖను ఆ అబ్బాయికి ఇద్దామని అనుకుంటున్నాము. మీరు ఏమంటారు అని అడిగారు.

ఈ క్రింది వీడియోని చూడండి

కొత్త అబ్బాయి.. సినిమాల్లో డాన్సులు, ఫైట్స్ బాగానే చేస్తున్నాడని చెబుతున్నారుగా.. అంటే ఆ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానిచ్చేయండి అని నాతో పాటు మా కుటుంబ సభ్యులందరం ఈ పెళ్లి విషయమై ఒకే చెప్పాం. ఈ రకంగా అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో చిరంజీవి వివాహాం జరిగింది. అప్పటికీ చిరంజీవి పెద్ద హీరో కూడా కాదు. ఆ తర్వాత చిరంజీవి అంచలంచలుగా ఎదిగి మెగాస్టార్ అయిన సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇక సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం ఆమెనే చూసుకుంది. ఇంట్లో అందరిని కలుపుకుపోయి, ఇంట్లో ఉన్న వాళ్ళందరి అవసరాలు తీరుస్తూ మంచి కోడలు అనిపించుకుంది. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవడం వలన, చిరంజీవి ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెట్టడం జరిగింది. ఒకవైపు తన పిల్లలు అత్తమామ ఆడబిడ్డలు మరుదుల బాగోగులు చూసుకున్న తీరు ఎంతో బాగుంటుందని ఆమె గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. ముఖ్యంగా చిరంజీవి సురేఖా పెళ్లి జరిగే సమయానికి పవన్ కళ్యాణ్ చాలా చిన్న పిల్లాడని అందుకే పవన్ ను కూడా సొంత కొడుకులాగే చూసుకుందని చాలా మంది చెప్తారు.ఈ విషయం గురించి చాలా సార్లు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. అన్న వదినలే తనకు తల్లిదండ్రులని వాళ్ళ పెంపకంలోనే నేను పెరిగానని వాళ్ళే నాకు దేవుళ్ళు అని పవన్ కళ్యాణ్ ఇప్పటికి చెబుతుంటారు. ఏది ఏమైనా రాజశ్రీ గారు చెప్పిన ఒక మాట వలన చిరంజీవికి ఒక మంచి భార్య దొరికింది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation