ఇది తాగితే కరోన రాదా? బ్రంహం గారి ఆలయ పూజారి ఘటన వెనుక అసలు నిజాలు

119

మిరియాలు బెల్లం కలుపుకుని తాగితే కరోనా రాదు అంటూ బ్రహ్మంగారి మఠం ఆలయ పూజారి చెప్పి.. ఆ తరువాత కన్నుమూసాడు అంటూ ప్రచారం సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఆ ఆలయ పూజారి దహన సంస్కారాలు పూర్తయ్యేలోపు మాత్రమే ఈ కషాయం తాగాలి అంటూ కండీషన్లు కూడా పెట్టేశారు. దీంతో జనాలు ఆ ఫార్ములా కషాయాన్ని తాగడం మొదలుపెట్టేశారు.

ఈ విషయంపై జనాల్లో తీవ్ర స్థాయిలో చర్చ కూడా నడుస్తోంది. ఇదే కాదు కరోనా కు సంబంధించి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో కథనాల్లో నిజమెంతో  ఎవరికి తెలియడం లేదు. అయితే కరోనా వ్యాప్తి దేశంలో రోజురోజుకు ఉధృతం అవుతోంది. దీనికి ఇప్పటి వరకు మందు కూడా కనిపెట్టలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలు చాలామంది పాటిస్తున్నారు.

IHG

 ఈ నేపథ్యంలోనే మిరియాలు, అల్లం, బెల్లం కలుపుకుని తాగితే కరోనా రాదు అని  బ్రహ్మం గారి మఠం పూజారి చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. ఈ విషయం కాస్త బాగా వైరల్ అవడంతో బ్రహ్మంగారి మఠం ఆలయం మేనేజర్ ఈశ్వరయ్యచారి దీనిపై స్పందించారు. బ్రహ్మంగారి మఠం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, అటువంటి కట్టు కథనాలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. అంతేకాకుండా ఈ కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. 


ఈ కథనాలను ట్రోల్ చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర డిజిపి, కడప ఎస్పీకి లేఖలు పంపుతున్నట్లు ఆలయ మేనేజర్ ఈశ్వరయ్యచారి తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదనే విషయం తేలిపోయింది. అయితే జనాలు మాత్రం వేరే రకంగా స్పందిస్తున్నారు. అందులో వాస్తవం ఉన్నా, లేకపోయినా ఒకసారి ఆ కషాయాన్ని తాగితే పోలే… కొంపలు ఏవీ మునిగిపోవు కదా అంటూ తేలిగ్గా ఆ విషయాన్ని తీసుకుంటున్నారు.

Content above bottom navigation