16 ఏళ్లుగా భార్య శవం పక్కనే నిద్ర.. ఇది ఓ భర్త ప్రేమ కథ!

మనకు ఉన్న బంధాలలో పవిత్రమైనది అంటే భార్యాభర్తల బంధమే. ఒకరికి ఒకరు తెలియకపోయినా పెళ్లి అనే తతంగంతో ఒకటై జీవితాంతం కష్టసుఖాలను పంచుకుని జీవిస్తారు.భర్తకు ఏ కష్టం వచ్చినా భార్య, భార్యకు ఏ సమస్య వచ్చినా భర్త అండగా ఉంటారు. అయితే ఈ కాలంలో చాలామంది భార్యాభర్తలు ఈ బంధానికి అంతలా విలువివ్వడం లేదు. కానీ ఈ కాలంలో కూడా ఒక గొప్ప భర్త ఉన్నాడు. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. పెళ్లితో ఒక్కటయ్యే ఆ జంట నిండు నూరేళ్లు ఒకరికి ఒకరు తోడుగా జీవించాలని కోరుకుంటారు. ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి చేయి ఒకరు వీడమని ప్రమాణం చేస్తారు. కానీ, వాటిని తు.చా. తప్పకుండా పాటించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఒక భర్త గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. భార్య చనిపోయినా సరే.. ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక.. ఆమె శవాన్ని తన పడక మీద పెట్టుకుని నిద్రిస్తున్నాడు.

Image result for wife and husband

లీ వ్యాన్‌కు 1975లో పెళ్లయ్యింది. అప్పటి నుంచి భార్య, భర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరికీ చిన్నవయస్సులోనే పెళ్లి చేయడం వల్ల వారి మధ్య స్నేహం ఏర్పడింది. వీరి ప్రేమకు ప్రతిఫలంగా ఏడు మంది పిల్లలు కలిగారు. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. అలా వారి బంధం మరింత బలపడింది. కానీ, విధి వారి ప్రేమకు విలన్‌ గా మారింది. సైన్యంలో పనిచేస్తున్న లీ 2003లో ఉద్యోగరీత్యా ఇంటికి దూరంగా విధులు నిర్వహించాల్సి వచ్చింది. ఆ సమయంలో అతడు దుర్వార్త వినాల్సి వచ్చింది. తాను ఎంతగానమో ప్రేమించే భార్య ఇకలేదని, అకస్మాత్తుగా చనిపోయిందనే సమాచారం అతడికి అందింది. దీంతో ఆమెను చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయల్దేరాడు లీ. కానీ, ఎక్కువసేపు ఆమె ముఖాన్ని చూడలేకపోయాడు. ఆలస్యమైతే శవం పాడవుతుందనే ఉద్దేశంతో స్మశానంలో పాతిపెట్టారు. భార్యను వీడలేక లీ స్మశానంలో ఆమె సమాధి పక్కనే నిద్రించేవాడు. నెలల తరబడి అతడు స్మశానంలో గడిపాడు. ఓ రోజు వర్షం కురవడంతో లీ ఆమె సమాధి వద్ద నిద్రపోలేకపోయాడు. దీంతో సమాధి పక్కనే సొరంగం తవ్వి, ఆమెకు దగ్గరగా పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత లీ పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అతడికి చివాట్లు పెట్టి ఇంటికి తీసుకెళ్లారు. కానీ లీ ఆమెను వదిలి ఉండలేకపోయాడు. దాంతో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్మశానంలోకి వెళ్లి ఆమె సమాధిని తవ్వాడు. ఆమె అస్థికలను ఓ సంచిలో వేసుకున్నాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి తన పడక గదిలో పెట్టుకుని నిద్రపోయాడు. ఆమె అస్థికలు కుళ్లిన స్థితిలో ఉండటంతో వాటిని చూడలేక మదన పడ్డాడు. దీంతో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

ప్లాస్టర్ ఆఫ్ పారీస్, సిమెంటు, జిగురు, ఇసుకల మిశ్రమంతో లీ ఓ మహిళ బొమ్మను తయారు చేశాడు. తన భార్య అస్థికలను అందులో ఉంచాడు. అప్పటి నుంచి ఆ బొమ్మనే తన భార్యగా భావిస్తూ నిద్రపోయేవాడు. ఈ విషయం తెలిసి అతడి పిల్లలు లీతో గొడవ పడ్డారు. తమ తల్లి అస్థికలను స్మశానంలోనే ఉంచాలని, లేకపోతే ఆమె ఆత్మకు శాంతి కలగదని వాదించారు. కానీ లీ మనసు మార్చడంలో విఫలమయ్యారు. లీ తన భార్య అస్థికలను బొమ్మలో పెట్టుకుని నిద్రపోతున్నాడని, దాని వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని ఎలాగైనా ఒప్పించి ఆమె అస్థికలను తిరిగి స్మశానానికి చేర్చాలని ప్రయత్నించారు. కానీ లీ అందుకు ఒప్పుకోలేదు. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా లీ మొండితనం వీడలేదు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. లీ ఆ బొమ్మను రోజూ శుభ్రం చేసి, దుస్తులు మారుస్తాడు.

అందంగా మేకప్ వేస్తాడు. గత కొన్నాళ్లుగా లీ నడవలేక వీల్‌ ఛైర్‌కు పరిమితమయ్యాడు. కానీ ఆ బొమ్మను మాత్రం వీడలేదు. ఇంకా అది అతడి వద్దే ఉంది. ఈ సందర్భంగా లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా భార్య బతికి ఉన్నప్పుడు మంచి దుస్తులు కొనలేకపోయా. అందుకే ఇప్పుడు ఆమె కోసం ఎన్నో కొత్త దుస్తులు తయారు చేశా. నా భార్య మృతదేహాన్ని జాగ్రత్తగా చూస్తున్నందుకు జనాలంతా నన్ను వింతగా చూస్తున్నారు. కానీ ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నా. నేను చనిపోయేవరకు ఆమె శవంతోనే నిద్రిస్తా’’ అని తెలిపాడు. ఇతని కథ వింటుంటే స్వచ్ఛమైన ప్రేమకు లీ గొప్ప నిదర్శనం అని అనిపిస్తుంది కదా.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation