తండ్రికోసం ఈ పసిబిడ్డ ఎంతలా ఏడుస్తున్నాడో చూస్తే కన్నీళ్లాగవు..

215

నెల్లూరు కు చెందిన ఈ బాబు పేరు హ్యాపీ. ఇతని తల్లి పేరు జాహ్నవి. తండ్రి పేరు ఉజ్వల్ దీప్. వీరిద్దరూ 2017 లో ప్రేమవివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రుల కి ఇష్టం లేదు. 2019 డిసెంబర్ 22 న ఇంట్లో గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగి జాహ్నవి చనిపోయింది. మా అమ్మాయిని భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించి చంపేశారు అని అమ్మాయి తల్లిదండ్రులు వీరి ముగ్గురి మీద అక్రమ కేసులు పెట్టి జైలు కు పంపించేశారు. జాహ్నవి తల్లితండ్రులు కనీసం బాబుని చూడను కూడా చూడకుండా వదిలేసి వెళ్లిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే కొందరు బంధువులు బాబును చేరదీశారు. కానీ వాళ్ళు మాత్రం ఎన్ని రోజులన్నీ బాబును దగ్గర చేరుస్తారు. అందుకే వాళ్ళు కూడా వదిలేశారు. బాబుకి ఏ లోటు రాకుండా చూడగలం కానీ రోజంతా నాన్న…నాన్న అని ఏడుస్తుంటే ఎలా చెప్పండి అని బంధువులు అంటున్నారు.. మా నాన్న ఎక్కడ ఎక్కడ అని అని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పోతున్నాం. బాబు అమ్మమ్మ, తాత ఎక్కడుంటారో మాకు తెలియదు అని బంధువులు చెప్తున్నారు.. అందరు కూడా ఉన్నా కూడా ఇప్పుడు ఈ బాబు ఒంటరి వాడు అయ్యాడు. బాబు అమ్మమ్మ తాత వచ్చి ఈ బాబును అక్కున చేర్చుకోవాలని కోరుకుందాం.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation