ఈ వీడియో 50 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే చూడండి..

200

‘మీతో మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంది. కానీ తప్పడం లేదు. నా వయసు ఎనభై ఆరు. మా ఆవిడ చనిపోయి రెండేళ్లు అవుతోంది. సెక్స్‌ ఆలోచనలు మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదు. ఆ ఫీలింగ్స్‌ కలగకుండా ఏదైనా మందు ఉంటే రాసివ్వండి? అని ఒక పెద్దాయన తన భాదను చెప్పుకొచ్చాడు. ఆ పెద్దాయన మొహమాటపడుతూనే అడిగాడు. నిజమే, ఇది ఆలోచించాల్సిన విషయమే. లైంగికపరమైన ఒంటరితనం చాలా తీవ్రమైన సమస్య. పాతికేళ్ల యువకుడి గురించో, నాలుగుపదుల నడివయసు వ్యక్తి గురించో మాట్లాడుతున్నప్పుడు మాత్రం… ‘పాపం! ఒంటరిగా ఎలా బతికేస్తాడో’ అని సానుభూతి కురిపిస్తారు కానీ, వయోధికుల విషయంలో మాత్రం అదో సమస్యే కాదన్నంత నిర్లిప్తంగా స్పందిస్తారు. పిల్లలు పెద్దవాళ్లయిపోయి, ఆ పిల్లల పిల్లలూ కౌమారానికి వచ్చారంటే ఇక లైంగిక జీవితం పరిసమాప్తం అయినట్టే. ఆ విషయాలు మాట్లాడినా, దాని గురించి ఆలోచించినా మహాపాపమే! పెద్దలంటే అలైంగిక జీవులన్న ఓ అపోహ! సెక్స్‌పరమైన ఆలోచనలే చేయకూడదన్న సామాజిక కట్టుబాటు. జీవితంలో లైంగికత ఓ భాగం. మనిషి మరో మనిషి సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడు. అందులో లైంగికమైన సామీప్యమూ ఒకటి. స్పర్శ, ఆలింగనం, సెక్స్‌… దాన్ని వ్యక్తం చేసే మార్గాలు. ఆ సామీప్య వాంఛ వయసుతో పాటు తగ్గిపోదు. మహా అయితే, దాన్ని వ్యక్తం చేసే పద్ధతి మాత్రం కాస్త మారిపోతుంది. కొన్నిసార్లు హఠాత్తుగా ఆగిపోతూ ఉంటుంది. అలా కావడానికి ఎన్నో కారణాలు..

Image result for wife and husband

ఒకటి…జీవిత భాగస్వామి ఏ వృద్ధాప్య సమస్యతోనో, తీవ్ర అనారోగ్యంతోనో మరణించడం. లేదంటే, కుటుంబ బాధ్యతల కారణంగా భర్త ఒకచోట, భార్య మరోచోట ఉండాల్సి రావడం.రెండు…కొన్ని అనారోగ్యాలు లైంగిక చర్యలకు అవరోధం కలిగిస్తాయి. ఉదాహరణకు.. మధుమేహం అంగస్తంభన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. మోకాళ్లనొప్పుల్లాంటివి శరీరాన్ని స్వేచ్ఛగా కదలనివ్వవు. దీంతో సెక్స్‌ బాధాకరం అవుతుంది.
మూడు…వివిధ రుగ్మతలకు వాడే కొన్నిరకాల ఔషధాలు లైంగిక శక్తిని తగ్గిస్తాయి. హార్మోన్ల సమస్యలు సెక్స్‌ను ఆస్వాదించలేని పరిస్థితి కలిగిస్తాయి. ఆసక్తి సన్నగిల్లడం, యోనిమార్గం పొడిబారిపోవడం ఆ ప్రభావాలే.

Image result for life partner romance hot
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్


నాలుగు…ఇద్దరిలో ఏ ఒక్కరిలోనో సహజమైన నిరాసక్తత ఏర్పడటం వల్ల రెండో వ్యక్తి కూడా కోరికల్ని చంపేసుకోవాల్సి రావచ్చు.ఐదు…ఇంట్లో తగినంత ఏకాంతం లేకపోవడం. పడకగదుల్ని కొత్తతరం ఆక్రమించేయడం.ఆరు…తరాల సంప్రదాయాలూ నమ్మకాల వల్ల లైంగిక సామీప్యం కాస్తా అలైంగిక పద్ధతుల్లోకి… అంటే సరస సంభాషణలకో, స్పర్శకో పరిమితం కావడం. చాలామంది తమ సమస్యను వైద్యుడితో చర్చించాలనే అనుకుంటారు. అంతలోనే, జీవితభాగస్వామో, స్నేహితుడో వద్దని వారించేస్తారు. ‘అదో సమస్యా? అదీ ఈ వయసులో? ఎవరైనా బీపీ గురించి భయపడాలి, షుగర్‌ గురించి భయపడాలి. పురాణాలు ముందేసుకుని కూర్చో… నువ్వు ఆలోచించే పద్ధతే మారిపోతుంది’ అంటూ సలహా ఇస్తుంటారు. వైద్యులైనా, ఆత్మీయులైనా… వయోధికుల లైంగిక సమస్యల్ని సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలి. మాట్లాడేలా, చర్చించేలా, చికిత్స చేయించుకునేలా ప్రోత్సహించాలి.

ఈ క్రింది వీడియో చూడండి

వృద్ధాప్యంలో శృంగారమూ ఓ చికిత్సలా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. చురుకైన లైంగిక జీవితం వల్ల డిప్రెషన్‌ దరిదాపుల్లోకి కూడా రాదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాజిటివ్‌ దృక్పథం అలవడుతుంది. కోరికల్ని బలవంతంగా అణచివేసుకునే ప్రయత్నం చేస్తే ఆలోచనలు పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ఏ పసిపిల్లల మీదో, పనిమనుషుల మీదో కళ్లు పడతాయి. ఫలితంగా బంధాలు దెబ్బ తింటాయి, పరువు బజారున పడుతుంది. పిల్లలు దూరమైపోతారు. జీవితభాగస్వామి అసహ్యించుకుంటుంది. అలా అని, లైంగిక ఆనందం లేకపోతే జీవితం పూర్తిగా నిస్సారమైపోతుందనే అభిప్రాయమూ సరైంది కాదు. పెంపుడు జంతువుల సమక్షంలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు. మన నైపుణ్యాన్ని ఏ స్వచ్ఛంద సంస్థల కోసమో వినియోగించవచ్చు. ఉత్తమ సాహిత్యం చక్కని కాలక్షేపాన్ని ఇస్తుంది.కాబట్టి వీటికి అలవాటుపడి ఆ ఆలోచనల నుంచి దూరం అవ్వండి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation