పసుపు రంగు బాగ్ కనిపిస్తే జాగ్రత్త

304

కరోనా అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. మాయదారి వైరస్ దరిదాపుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు.. ప్రభుత్వం చేసిన సూచనల్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా చోటు చేసుకునే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి వచ్చిన వారిని.. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో క్వారంటైన్ హోంలు.. జోన్లుగా ఏర్పాటు చేస్తున్న వేళ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఇలాంటి ప్రాంతాలు.. వ్యక్తులు వినియోగించే వ్యర్థాలు చాలా అపాయకరమన్నది మర్చిపోకూడదు. మిగిలిన వారితో పోలిస్తే.. హోం క్వారంటైన్ లో ఉన్న వారి విషయంలో కేర్ ఫుల్ గా ఉండటమే కాదు.. వారు వినియోగించిన వస్తువులకు సంబంధించిన వ్యర్థాల్ని ఎలా డిస్పోజ్ చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారంతా ఎల్లో (పసుపు రంగు) బ్యాగుల్ని మాత్రమే వాడాలని పేర్కొంది.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

అంతేకాదు..ఈ ఎల్లో బ్యాగుల్ని పూర్తిగా కాల్చివేయాలని ప్రభుత్వం చెబుతోంది. పారిశుద్ధ్య కార్మికులు ఈ పసుపుపచ్చ బ్యాగుల విషయంలో జాగ్రత్తగా ఉండటంతో పాటు.. వాటిని వేరుగా తీసుకని భస్మం అయ్యే వరకూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కింది స్థాయి సిబ్బందిలో ఎవరైనా అప్రమత్తంగా లేకుండా ఉండటం కారణంగా కాల్చకుండా ఉంటే.. అలాంటి వాటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతేకాదు.. క్వారంటైన్ ప్రాంతాల్లోనూ.. పాజిటివ్ కేసుల్ని డీల్ చేసే వైద్యులు.. వైద్య సిబ్బంది ఉపయోగించే మాస్కులు.. గ్లౌజ్ లు వాటన్నింటిని ప్రత్యేకంగా కాల్చి వేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మహానగరంలోనే దాదాపుగా 15వేల వరకూ హోం క్వారంటైన్లు ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన వ్యర్థాలు పెరిగే వీలుంది. వీటిని డిస్పోజ్ చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఎక్కడైనా ఎల్లో బ్యాగులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావటంతో పాటు.. వాటికి దూరంగా ఉండి అధికారులకు సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది.

Content above bottom navigation