ఈ మద్య దేశంలో టిక్ టాక్ గోల ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. టిక్ టాక్ వల్ల ఎంత ఎంట్రటైన్ మెంట్ ఉందో అంత నష్టాలు కూడా ఉన్నాయి. టిక్ టాక్ వల్ల కొంత మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. ముఖ్యంగా టిక్ టాక్ మోజులో పడి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంత మంది ఈ టిక్ టాక్ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా జరిగాయి. ఆ మద్య సోషల్ మీడియాలో అల్పితా చౌదరి అనే లేడీ కానిస్టేబుల్ చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది. అయితే విధి నిర్వహణలో ఆమె టిక్ టాక్ వీడియో చేసిందన్న కారణంతో డిపార్ట్ మెంట్ ఆమెను సస్పెండ్ చేసింది. కానీ ఇప్పుడు అదే ఆమెను సెలెబ్రిటీని చేసింది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

అల్పిత గుజరాత్ రాష్టంలోని అహ్మదాబాద్ లోక్ రక్షక్ దళ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే, మెహ్సానా జిల్లా లంఘ్ నాజ్ పోలీస్ స్టేషన్ లాకప్ లో ఆమె టిక్ టాక్ వీడియో చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెను సస్పెండ్ చేసినప్పుడు అల్పితా ఎంతో బాధపడింది. కానీ ఇప్పుడు అలా సస్పెండ్ చెయ్యడమే తనకు మంచి జరిగేలా చేసిందని సంతోషపడుతుంది. ఎందుకంటే సస్పెండ్ అయిన అల్పితా ఇప్పుడు స్టార్ సింగర్ గా మారింది. సస్పెండ్ అయిన తర్వాత గుజరాత్ ఫోక్ సింగర్ జిగ్నేష్ కవిరాజ్ తో కలిసి గత సెప్టెంబర్లో ‘ టిక్ టాక్ నే దీవానీ ’ పేరుతో ఓ వీడియో ఆల్బమ్ విడుదల చేశారు. మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాతీ యాక్టర్ ధవల్ బరోత్ తో కలిసి ఆమె చేసిన ‘కచ్చీ కేరీ, పకి కేరీ’ ఆల్బమ్ కూడా సక్సెసయింది. ఒక్క ఆల్బమ్ తో స్టార్ గా అల్పిత సెలబ్రిటీ హోదా అందుకుంది. సస్పెండైనప్పటి నుంచి ఇప్పటివరకు 4 వీడియో ఆల్బమ్లలో అల్పిత కనిపించింది. దీంతో ఆమె క్రేజ్ పెరిగి గుజరాతీ సినిమాల్లో నటించాలని ఆఫర్లు కూడా వస్తున్నాయి.
ఈ క్రింది వీడియో చూడండి
దీనిపై ఆమె స్పందిస్తూ.. తనకూ నటించాలని ఉందని, కానీ పై అధికారుల నుంచి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం మెహ్సనా జిల్లాలోని కడి పోలీస్ స్టేషన్లో అల్పిత పని చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్, బందోబస్త్కు వెళ్లినప్పుడు జనం సెల్ఫీ కోసం గుమిగూడతారని అల్పిత చెబుతున్నారు. ‘ యాక్టర్, మోడల్, సింగర్ కావాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. కానీ మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తారు. నన్ను ఓ పోలీస్ లా చూడాలనుకున్నారు. ఆయన కోసం పోలీసాఫిసర్ అయ్యాను. కానీ ఓ డ్రీమ్ కోసం ఇంకో డ్రీమ్ ను వదులుకోవద్దని అనిపించింది’ అని అన్నారు. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ వరకే పరిమితమైన ఆమె ఖ్యాతి ఇప్పుడు గుజరాత్ మొత్తం విస్తరించింది. ఇంకేముంది ఆ అమ్మడు పాటలకు ఫిదా అయిన ఆడియన్స్ ఆమెను ఇఫ్పుడు స్టార్ హోదాలో చూస్తున్నారు.
ఈ క్రింది వీడియో చూడండి