బంగారం ధరలు రికార్డు ఒక్క రోజులోనే భారీ షాక్ తులం ఎంతంటే

బంగారం కొనాలనుకునేవారికి షాక్. బంగారం ధర మళ్ళీ పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరగడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా మన మార్కెట్‌లో బంగారం ధర పెరగడం విశేషం. హైదరాబాద్ మార్కెట్‌ లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో రూ.44,100కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,430కు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.150 పెరగడంతో వెండి ధర రూ.41,150కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పైకి కదలడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

నికిషా పటేల్ అందాలు చూస్తే సెగలు పుట్టాల్సిందే

ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.79 శాతం తగ్గడంతో బంగారం ధర ఔన్స్‌కు 1738.90 డాలర్ల వద్దకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 1.39 శాతం తగ్గడంతో 15.83 డాలర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,120కు చేరింది. వెండి ధర కూడా రూ.170 పెరుగుదలతో రూ.40,860కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌ లో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరుగుదలతో రూ.42,570కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.710 పెరుగుదలతో రూ.44,970కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.41,150కు చేరింది.

Gold prices up marginally; silver tumbles by Rs 590 per kg ...

బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌ లో మళ్లీ పరుగులు పెట్టింది. దీంతో మన మార్కెట్‌ లో కూడా పెరిగింది. బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation