మారుతీరావు ఆత్మహత్యపై దర్శకుడి కామెంట్స్..

63

కూతురు కులాంతర వివాహం చేసుకుందని కక్షకట్టి, తన పరువు పోతుందని మధనపడి అల్లుడు ప్రణయ్ ను అత్యంత పాశవికంగా కిరాయి హంతకులతో హత్య చేయించిన మారుతీ రావు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. భర్త మరణించిన తర్వాత తన కూతురు తన దగ్గరకు రాకపోతుండడం, హత్యా కేసుకు సంబంధించి ఆయనకు శిక్ష పడడం కూడా ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ ఉదంతం తరువాత అమృత ఉదయం తన తండ్రిని చివరిసారిగా కడసారి చూపు కోసం వెళితే, ఆమెకు ఆ అవకాశం దక్కకుండానే అక్కడి నుండి వెనక్కి పంపించివేశారు. తండ్రి చివరి చూపు కూడా దక్కకుండానే ఆమె వెనక్కి వచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా మాట్లాడుకున్నా, మారుతీరావు – అమృత ధీనగాధలో నష్టపోయింది ఆ తండ్రికూతుళ్లే. పగ, ప్రతీకారం కోరుకున్న ఆ తండ్రి కూతురుపై ఉన్న అమితమైన ఇష్టంతో చివరికి ప్రాణాలు తీసుకున్నారు. కన్న తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేకపోయింది అమృత. లోకం దృష్టిలో మరోసారి దోషిగా నిలబడింది. అప్పుడు భర్త చావుకు, ఇప్పుడు తండ్రి చావుకు ఈ కూతురే కారణం అంటూ గుచ్చి గుచ్చి చంపెందుకు సోషల్ మీడియాలో పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు. అమృతకు బతికి ఉండగానే నీచమైన పోస్ట్‌ లతో పాడెకట్టేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పెద్ద విలన్ ఎవరైనా ఉన్నారంటే అది అమృత అనే చెప్పుకోవాలి. ఈ ఇష్యూలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. అమృతను ‘కరోనా’వైరస్ కంటే ప్రమాదకరంగా భావిస్తూ రకరకాల పోస్ట్‌ లు పెడుతున్నారు. ఇక ఈ ఘటనపై ‘పలాస 1978’ సినిమా దర్శకుడు కరుణ కుమార్ స్పందించారు.

Image result for మారుతీరావు ఆత్మహత్యపై దర్శకుడి కామెంట్స్.

‘ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని అందమైన జీవితాన్ని ఊహించుకున్నారు. అమ్మాయి గర్భం దాలిస్తే భర్త ఆమెను చెకప్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా నడిరోడ్డు మీద నరికేసారు. ఈ ఘటన జరగడానికి ముందు వాళ్లు తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కనుంటారు. అవన్నీ ఒక్క క్షణంలోనే చిద్రమైపోయినట్లే కదా. దీని అంతటికీ కారణం కులం. ఈ ఘటన జరిగిన ఏడాది అవుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడు. ఆ అబ్బాయి నిజంగానే మంచివాడు కాదు అన్నప్పుడు వద్దమ్మా అని చెప్పినా కూడా అర్థం ఉంది. అంతేకానీ అతను తక్కువ కులానికి చెందినవాడు అని చంపేయడం ఎంత వరకు కరెక్ట్?. ‘ మారుతీరావుగారు అలా చనిపోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా. దీని వల్ల ఏం జరుగుతుందంటే.. ప్రణయ్ కులానికి చెందినవారు తమ కులాన్ని అగౌరవ పరిచాడు, మచ్చతెచ్చాడు అని చెప్పి మారుతీ రావు విగ్రహం కూడా ఏర్పాటుచేస్తారు. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. కచ్చితంగా ఇదే జరుగుతుంది. ఈ సినిమాలో కూడా మేం ఎవరి కులాన్ని కూడా తక్కువ చేసి చూపించలేదు. అందరినీ సమానంగానే చూపించాం’ అని తెలిపారు. దర్శకుడు చేసిన ఈ కామెంట్స్ మీద ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కొందరు పాజిటివ్ కామెంట్స్ పెడితే, కొందరు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation