ప్రపంచంలోనే 10 ఘోరమైన ఉద్యోగాలు..

215

చాలా మంది ఉద్యోగస్తులు వారి వారి ఉద్యోగాలతో సంతోషంగా లేరని ఎన్నో సర్వేలు రీసెర్చ్ లు మరియు రక రకాల రిపోర్టుల ద్వారా మనం వింటూ ఉన్నాం..ప్రతీ వారు వారి వారి క్వాలిఫికేషన్ కు తగ్గ ఒక మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు..అలా కొందరు డాక్టర్లయితే ఇంకొందరు ఇంజినీర్స్ అవుతారు..మరికొందరు ఐ ఎ ఎస్ లయితే కొంతమంది టీచర్స్ గా వారి వారి జీవితాల్లో స్థిరపడతారు.. కానీ ఈ రోజు ఈ వీడియోలో నెను చెప్పే ఉద్యోగాల గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..అసలు ఇలాంటి ఉద్యోగాలు నిజంగా ఉంటాయా..వీటికి ఇంతింత జీతాలు ఇస్తారా అంటే దానికి ఖచ్చితంగా ఔననే చెప్పాలి…మరి ఆ వింతైన ఉద్యోగాలు ఏంటో చూద్దాం..

Image result for బాయ్‌ఫ్రెండ్ తో హైర్

నంబర్ 10..బాయ్‌ఫ్రెండ్ తో హైర్..ఒకవేల మీరు కావాలనుకుంటే జపాన్ రాజధాని టొక్యోలో అద్దె బాయ్‌ఫ్రెండ్ గా మారిపోవచ్చు..ఔను మీరు విన్నది అక్షరాల నిజం..ఇక్కడ అమ్మాయిలు వారి ఒంటరి తనాన్ని దూరం చేసుకొవడానికి అద్దెకుబాయ్ ఫ్రెండ్ ను హైర్ చేసుకుంటారట..ఇలా వారి వారి ఇష్టాలను బట్టి గంటా రెండు గంటలపాటు హైర్ చేసుకుంటారట..అయితే కంగారు పడకండి..బాయ్ఫ్రెండ్ గా ఉండడం అంటే అలాంటివేవి ఉండవట..మరి ఇలా బోలెడు డబ్బు ఖర్చుపెట్టి గంటా రెండు గంటలు బాయ్‌ఫ్రెండ్ తో ఉంటే ఈ జపనీస్ అమ్మయిలకు ఏం ఆనందమో గాని అక్కడి అబ్బాయిలకు మంచి పార్ట్ టైం జాబ్ అయిపోయిందట..

Image result for స్టాండింగ్ ఇన్ ద క్యూ లైన్…

నంబర్ 9…స్టాండింగ్ ఇన్ ద క్యూ లైన్…

బిజీ బిజీ గా ఉండే లైఫ్ తో ఈ రోజుల్లో మనుషులకు అసలు టైమే దొరకట్లేదు..మరి అలాంటిది సినిమా టికెట్ల కోసం లైన్లో ఎవరు నిల్చుంటారు..దీనికోసం లైన్లో నిలుచుండే వారిని మనం పనిలో పెట్టుకోవచ్చు.. వారు మన బదులు ఎంత పొడవైన లైన్లో అయినా నిల్చుంటారట..దానికి వాళ్ళు డిమాండ్ చేసినంత మనం పే చేసుకొవాల్సిందే…లైన్లో నిలుచొవడానికి బద్దకం అయితే తప్పదు మరి..

నంబర్ 8 స్లీపింగ్ జాబ్..ఇంత ప్రశాంతమయిన ఉద్యోగం చేయడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి..ఈ ఉద్యోగంలో ఎంప్లాయ్ చెసే పని కేవలం నిద్రపోవడమే..అంతే కాదు ఇలా నిద్ర పోయినందుకు వారికి వేలకు వేలు జీతాలు ఇస్తారట..నిజానికి సైంటిస్టులు మరియు రీసెర్చర్స్ నిద్రకు సంబందించిన జబ్బులపై రీసెర్చ్ చేస్తారు.. అందుకోసం ఇంతింత డబ్బులు పోసి మరీ నిద్ర పొమ్మంటున్నారు..

నంబర్ 7…పెళ్ళిళ్ళకు గెస్ట్ గా వెళ్ళే ఉద్యోగం..

మనదేశం లో పెళ్ళిళ్ళకయితే పిలిచినోల్లతో పాటు పిలవని వాళ్ళు కూడా ఎగబడి వస్తారు..అందుకని ఈ ఉద్యోగానికి మనదేశంలో డిమాండ్ లేదు..కానీ జపాన్లో కొంతమంది ఈ పనిని పార్ట్ టైం జాబ్ గా ఉంచుతారు..దీన్లో భాగంగా వారు ఏదైనా పెళ్ళికి పిలిచినప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది..ఇలా వెళ్ళినందుకు గాను కడుపు నిండా భోజనం పెట్టి మంచి సంభావన కూడా ఇస్తారట..

Image result for indian marriages

నంబర్ 6..వామిట్ క్లీనర్

ఎమ్యూజ్మెంట్ పార్క్ లో జైంట్ వీల్ ఇలా రకరకాల వాటిపైన రైడ్స్ ఎంజాయ్ చేయడం వలన చాలా మందికి కళ్ళు తిరగడం మామూలు విషయం..దీంతొ కొందరికి వాంతులు కూడా అయిపోతూ ఉంటాయి..ఇలా కస్టమర్స్ వామ్‌టింగ్ ను క్లీన్ చేసినందుకు కొంతమందికి సాలరీ ఇస్తారు..

నంబర్ 5..డియోడరెంట్ టెస్ట్..వీరు చేసే పనల్లా మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు రకరకాలా బాడీ స్ప్రేస్ శరీరం పై ఏవిధంగా పని చేస్తాయో టెస్ట్ చేయడమే..కానీ ఇది సులువైన పని అనుకుంటే తప్పే..ఎందుకంటే రకరకాల శరీర తత్వాలు ఉన్నవారిని ఇలా స్మెల్ చేసి మరీ టెస్ట్ చేయాలి..వీరికి జీతాలు లక్షల్లో ఉంటాయి..

Image result for ఫ్యునరల్

నంబర్ 4 …క్రైయింగ్ ఎట్ ద ఫ్యునరల్.. మన దేశంలో కూడా ఇలాంటి విషయాల గురించి వినడమో చదవడమో చేసి ఉంటారు..ఔను ఈ ఉద్యోగం చేసే వారి పనల్లా శవాల దగ్గర ఏడవడమే..ఇలా చేయడం వలన వారికి ముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.ఇలా ఏడ్చినందుకు గాను వీరికి బాగా డబ్బులు కూడా ఇస్తారట..

Image result for ఎలిఫెంట్ ఎగ్జామినర్.

నంబర్ 3..ఎలిఫంట్ ఎక్జామినర్..

మీరు ఎలిఫంట్ ఎక్జామినర్ గా పని చేయాలనుకుంటే మాత్రం వాటి కడుపును సుభ్రం చేయదం కోసం ఇలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది..అంతే కాదు వాటికి ఎక్కడయినా ఇంజూరిస్ ఉన్నాయని చెక్ చేసి రెగ్యులర్ గా రిపోర్ట్స్ రాస్తూ ఉండాలి..ఇవన్నీ రొటీన్ గా అనిపించినా ఇది చాలా రిస్క్ జాబ్..ఏనుగులు 4 నుంచి 7 టన్నుల బరువుంటాయి..వాటిని టెస్ట్ చేసే టైంలో గాని ట్రీట్ మెంట్ చేసే సమయంలో గాని అవి తిరగబడితే ఎం జరుగుతుందో ప్రత్యెకంగా చెప్పనక్కర లేదు…

ఈ క్రింది వీడియో చూడండి

నంబర్ 2..ఎలెక్ట్రిక్ షాక్…మెక్సికో లో కొంతమంది మనుషులకు కరంట్ షాక్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు..ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా..అసలు విషయానికి వస్తే మెక్సికో లోని బార్లు పబ్బుల్లో కొంతమంది బాగా తగిన మత్తులో రకరకాల చేష్టలు చేస్తుంటే అలాంటి వారు తాగింది దిగడానికి కరెంట్ షాక్ ఇస్తారట..ఇలా కేవలం ఒకే ఒక్క కరంట్ షాక్తో తలకెక్కిన నషా మొత్తం దిగిపోయి మామూలుగా ప్రవర్తిస్తారట..

నంబర్ 1..న్యూడ్ మోడల్ ఫర్ పెయింటర్స్..అదేంటి పెయింటింగ్ జాబ్ అని అనుకుంటున్నారు కదా..అసలు కధ పెయింటర్స్ ది కాదు..ఈ పెయింటింగ్ వేయడం కోసం చాలా మంది పెయింటర్స్ ముందు న్యూడ్ గా ఒక మోడల్ కూచోనుంటుంది..ఇలాంటి మోడాల్స్ ను చాల యూనివర్సిటీ వాల్ల వల్ల స్టూడెంట్స్ కు పెయింటింగ్ నేర్పించడం కోసం హైర్ చేసుకుంటారట..దీనికి వీరికి ఒక క్లాస్ కు లక్ష రూపాయలు ఇస్తారట..కానీ ఇది అంత సులువయింది అనుకుంటే మాత్రం చాలా తప్పే..మోడల్స్ పెయింటింగ్ వేసేటప్పుడు కొన్ని గంటల పాటు కదలకుండా అలానే కూచోవాలట… ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపం లో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation