2000 కోట్ల ఇల్లు.. Top 5 Most Expensive Houses In The World

1236

ఏదైనా ఇంటిని కానీ, హోటల్ ను కానీ నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. మహా అయితే ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. కొంచెం కాస్ట్లీ అయితే 2 లేదా 3 కోట్ల ఖర్చు అవుతుంది. కానీ వందల కోట్లు ఖర్చు చేసిన నిర్మాణాల గురించి మీరు విన్నారా.. అన్ని కోట్లు ఖర్చు చేశారంటే అవి ఎంతో ప్రత్యేకంగా ఉండి ఉంటాయి కదా. మరి అలా ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ నిర్మాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for Top 5 Most Expensive Houses
 • ప్లోటింగ్ హౌజ్..
  నిజానికి ఈ ఇంటిని నిర్మించాలనే ఆలోచన బోట్ ను చూసి వచ్చింది. అందరిని ఆకర్షిస్తున్న ఈ ఇల్లు దుబాయ్ లో ఉంది. ఈ ఇల్లు మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. పైన భాగంలో ఉండే చోటులో కూర్చొని మన చుట్టూ ఉండే పరిసరాలు చూడొచ్చు. మధ్య భాగంలో కిచెన్, బాత్ రూమ్స్ ఉంటాయి. కింది భాగంలో బెడ్ రూమ్ ఉంటుంది. ఈ ఇంటి గోడలు మెటల్ తో తయారుచేశారు. దాని వలన నీళ్లలో ఉండే ప్రమాదకర జీవుల వలన ఎలాంటి హాని ఉండదు. ఈ ఇంట్లోకి ఒక్కసారి ప్రవేశిస్తే చాలు, ఆ ఎక్స్ పీరియన్స్ జీవితాంతం మర్చిపోకుండా ఉంటుంది.
 • అండర్ వాటర్ రెస్టారెంట్..
  ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్లు రకరకాల ప్రదేశాలకు వెళ్లి ఫుడ్ తినాలని అనుకుంటారు. ఇప్పుడు చేప్పే రెస్టారెంట్ అలంటి కోవకే వస్తుంది. ఈ రెస్టారెంట్ చాలా ప్రత్యేకమైనది. ఇది అండర్ వాటర్ లో ఉంది. ఈ రెస్టారెంట్ కు మీరు వెళ్తే మీ చుట్టూ చేపలు, షార్ప్ లు, డాల్పిన్స్, కొన్ని ప్రమాదకర జీవులను చూస్తూ మీరు ఫుడ్ తినవచ్చు. ఇక్కడ వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. రెస్టారెంట్ చుట్టూ మొత్తం గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ బయట ఉండే అన్ని జీవులు కూడా కనిపిస్తాయి. అలా బయట ఉండే జీవులను చూస్తూ, ఎంజాయ్ చేస్తూ తినవచ్చు.
Image result for ఫ్లోటింగ్ హౌస్
 • ద వాటర్ డిస్కస్ హోటల్..
  మీరు కనుక ఈ హోటల్ కు వెళ్తే..మనం భవిష్యత్ లోకి వెళ్ళామా అనే సందేహం వస్తుంది. ఈ హోటల్ సముద్రం మధ్యలో నిర్మించారు. ఈ హోటల్ లో పడుకునేందుకు బెడ్ రూమ్స్, ఎంజాయ్ చేసేందుకు డిస్కో, పెద్ద కిచెన్, రెస్టారెంట్, సినిమా హాల్ కూడా ఉంది. ఈ హోటల్ పై భాగంలో ఒక ఫుట్ బాల్ గ్రౌండ్ కూడా ఉంది. దాని చుట్టూ బెడ్ రూమ్స్ ఉంటాయి. మీ బెడ్ రూమ్ లో కూర్చొని ఫుట్ బాల్ మ్యాచ్ ను ఎంజాయ్ చెయ్యవచ్చు.
Image result for ద వాటర్ డిస్కస్ హోటల్.
 • ద క్యూబ్ హోటల్..
  ఈ హోటల్ అమెరికాలో ఉంది. ఈ హోటల్ మొత్తం నీటి కిందనే నిర్మించారు. ఈ హోటల్ ను చుస్తే టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యిందో మనకు అర్థం అవుతుంది. ఇందులో ఎన్నో రకాల అడ్వెంచర్స్ ఉన్నాయి. మీకొక విషయం తెలుసా? ఈ హోటల్ ను విష్ చెయ్యడానికి ఉన్న వెయిటింగ్ లిస్ట్ లక్ష పాతికవేలు. ఆశ్చర్యపోయారు కదా.. ఈ హోటల్ ప్రత్యేకత అలాంటిది మరి. ఈ హోటల్ లో ఉండే రూమ్స్ ఒక క్యాప్సేల్స్ లాగ ఉంటాయి. ఒక్కొక్క క్యాప్సెల్ ఒక్కొక బెడ్ రూమ్ లాగా ఉంటుంది. ఈ క్యాప్సెల్ ఒక్కొక్కసారి రైడ్ కు కూడా వెళ్తుంది. దాంతో మీరు మీ బెడ్ రూమ్ లోనే ఉండి, సముద్రంలో ఉన్న చేపలను, షార్ప్ ల ప్రదేశాలకు ఒక రౌండ్ వేసి రావొచ్చు.

ఈ క్రింది వీడియోని చూడండి

 • ద ఫ్యూచర్ హౌజ్..
  దీనిని అమెరికా వాళ్ళు నిర్మిస్తున్నారు. మీరు కనుక ఈ ఫ్యూచర్ హౌజ్ లోకి వెళ్తే మీరు ఒక 50 ఏళ్ళు ముందుకు వెళ్తారు. దీనిలో ఉండే టెక్నాలజీ అలాంటిది మరి. ఇందులో ఉండే మెషీన్స్ కానీ, దీనిలో ఉపయోగించే టెక్నాలజీ, మోటార్స్ కానీ, నీళ్లలో ఈ హౌజ్ తెలియాడేలా చేస్తుంది. ఒక్కసారి ఇందులోకి వెళ్తే మీరు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఫీలవుతారు. తొందర్లోనే దీని నిర్మాణం కంప్లీట్ కానుంది.

ఇవేనండి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న నిర్మాణాలు. వీటి గురించి వింటుంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా.. మరి వీటిని దర్శిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation