అల్లు అర్జున్‌పై షకీలా షాకింగ్ కామెంట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. మొదట చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ సినిమాలో డాన్సర్‌గా తెరంగేట్రం చేసాడు.ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగోత్రి’సినిమాతో హీరోగా ప్రమోషన్ పొందాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్య’ సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకుని వెనుదిరిగి చూసుకోలేదు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు హీరోగా అల్లు అర్జున్‌కు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గురించి తాజాగా షకీలా అన్న ఓ మాట ప్రస్తుతం పలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్‌ గురించి స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేలా మాట్లాడింది. దీంతో ఈ టాపిక్ బన్నీ అభిమాన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Image result for shakila

షకీలా విషయానికొస్తే.. శృంగార తారగా మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎంతలా అంటే.. ఆమె సినిమా వస్తుందంటే.. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్స్ తమ సినిమాలను వాయిదా వేసుకునేంతలా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అటువంటి సినిమాలకు పులిస్టాప్‌ పెట్టి మాములు సినిమాల్లో యాక్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈమె ఒక యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్‌లోని ఎత్తు పల్లాలను ప్రస్తావించారు. ఇక టాలీవుడ్ హీరోల గురించి చెప్పమని అడగగా.. దాదాపు అందరు హీరోల గురించి చెప్పిన షకీలా, సడెన్‌గా అల్లు అర్జున్ గురించి అడగ్గానే నాకు తెలియదని సమాధానిమచ్చింది. దేశ విదేశాల్లో సైతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. అందుకే ఆయన సినిమాలకు అక్కడ భారీ డిమాండ్ ఉంటుంది. బన్నీ సినిమా వస్తుందంటే చాలు దేశవిదేశాల్లోని బన్నీ ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకుంటూ అన్ని ఏరియాల్లో భారీ కటౌట్స్ లాంటివి కడుతుంటారు. అలాంటి ఈ హీరో తనకు తెలియదని సింపుల్‌ గా అనేసింది షకీలా.

ఈ క్రింది వీడియోని చూడండి

దీంతో ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో పాటు తమిళ, మలయాళీ ఇండస్ట్రీలో సైతం మంచి గుర్తింపు ఉన్న తమ హీరో గురించి షకీలా తెలియదని చెప్పడాన్ని వారు జీర్ణంచుకోలేకపోతున్నారు. దీనిపై మరికొందరు ఆమెకు నిజంగానే బన్నితో పరిచయం లేకపోవడం వల్లే అలా చెప్పి ఉండవచ్చని కొందరు అంటుంటే, మరికొందరేమో షకీలా చేసిన ఈ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఏది ఏమైనా షకీలా చేసిన ఈ కామెంట్స్ ను పెద్ద రచ్చ చేయాల్సిన విషయం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు రెడీ అవుతున్నాడు. దసరాకు ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation