పాత బ్యాగులో రూ.30 లక్షలతో రైలు ప్రయాణం.. అదే అతడి జీవితాన్ని మార్చేసింది

ప్ర‌యాణాలు చేసే వారు చాలా మంది పాత బ్యాగులు తీసుకువెళ‌తారు దీనికి కార‌ణం ఇప్ప‌టి త‌రం వారికి తెలియ‌దు.కాని గ‌తంలో చాలా మంది ఈ పాత బ్యాగులు తీసుకువెళ్ల‌డానికి ఓ పెద్ద రీజ‌న్ ఉంది అని చెబుతున్నారు..అవును ఎందుకు అంటే వారి ద‌గ్గ‌ర ఉన్న బంగారం విలువైన వ‌స్తువులు డ‌బ్బు అన్నీ పాత బ్యాగుల్లో తీసుకువెళ్లేవార‌ట‌.. అది నాటి నుంచి ఫాలో అవుతున్న‌ది, ముఖ్యంగా దొంగ‌ల నుంచి త‌ప్పించుకునేందుకు ఈ పాత బ్యాగులు వాడేవారు. ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో చాలా మంది ఇదే ట్రిక్ పాటించేవారు. ఇలా చేస్తే దొంగ‌ల‌కు దొర‌కం అని ఆలోచించేవారు.అందులో విలువైన వ‌స్తువులు ఏమీ ఉండ‌వు అని అవి వ‌దిలేస్తారు.. కాని కొత్త‌గా క‌నిపించే బ్యాగులు మాత్రం ప‌ట్టుకు పారిపోతారు.. ఇది బ‌స్సులు రైళ్లులో ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో ఎక్కువగా క‌నిపిస్తుంది.. ఇలా చాలా మంది త‌మ ప్ర‌యాణాల్లో బ్యాగులు పోగొట్టుకున్నాం అని చెబుతారు.. కాని ఇప్పుడు దొంగ‌లు కూడా తెలివి తేట‌లు చూపుతున్నారు పాత కొత్త బ్యాగు అని కాదు ఏది ఉన్నా ప‌ట్టుక‌పోతున్నారు, పైగా బంగారం డ‌బ్బు పాత బ్యాగులు కూడా దొంగ‌త‌నం చేస్తున్నారు. తాజాగా ఓ వ్య‌క్తి ఇలాంటి ప్లాన్ వేశాడు.. కాని అత‌నికి ఏం జ‌రిగిందో తెలిస్తే మ‌తిపోతుంది.

Image result for పాత బ్యాగులో రూ.30 లక్షలతో రైలు ప్రయాణం.

రామారావు అనే వ్య‌క్తి త‌న పుట్టిన ఊరిలో 5 ఎక‌రాల పొలం అమ్మాడు, ఆ అమ్మిన పొలం డ‌బ్బులు 30 ల‌క్ష‌లు తీసుకుని రైలులో ప్ర‌యాణం చేస్తున్నాడు …వాటిని డిపాజిట్ చేసుకుని ఆ డ‌బ్బుల‌తో వ‌చ్చే వ‌డ్డీతో త‌న జీవితం గ‌డుపుదాం అని అనుకున్నాడు, ఇక త‌న‌కు పొలం లేదు కాబ‌ట్టి క‌వులు డ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం కూడా లేదు. అందుకే ఆ 30 ల‌క్ష‌లు పాత బ్యాగులో పెట్టుకుని న‌గ‌రానికి వ‌స్తున్నాడు.రాత్రి 1 గంట వ‌ర‌కూ నిద్ర పోకుండా బ్యాగుని జ‌గ్ర‌త్త‌గా ప‌ట్టుకుని కూర్చున్నాడు, త‌ర్వాత రాత్రి 3 గంట‌ల స‌మయంలో త‌న బ్యాగు త‌ల కింద పెట్టుకుని ప‌డుకున్నాడు …ఉద‌యం త‌ను దిగాల్సిన స్టేష‌న్ వ‌చ్చింది అయినా అత‌నికి మెల‌కువ రాలేదు సుమారు ట్రైన్ ఆగి రెండు గంట‌లు అయింది చివ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల‌కు రైలు శుభ్రం చేసేవారు వ‌చ్చి అత‌నిని లేపారు, దీంతో నిద్ర‌మ‌త్తు నుంచి అత‌ను లేచాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

త‌న డ‌బ్బులు బ్యాగ్ చూసుకున్నాడు కాని ఆ బ్యాగ్ లేదు, అత‌నికి మ‌త్తు మందు కాస్త డోస్ ఇచ్చిన‌ట్టు అనుమానం వ‌చ్చింది. దీనిపై రైల్వే పోలీసుల‌కి ఫిర్యాదు చేశాడు.. అయితే పాత దొంగ‌లు నేరస్తుల ముఠా వారి ప‌నే అని భావిస్తున్నారు పోలీసులు , అలాగే అత‌ని వెన‌కాల ఎవ‌రైనా ఫాలో అయ్యారా అనేది కూడా సీసీ టీవీ ఫుటేజ్ చూసి ప‌రిశీలిస్తున్నారు పోలీసులు.. పాపం 30 ల‌క్ష‌లు పొగొట్టుకోవ‌డంతో అత‌ను క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నాడు… త‌న‌కు ఇక బ‌త‌క‌డానికి మార్గం లేదు అని క‌న్నీరు మున్నీరు అవుతున్నాడు… ఆ రైలు ప్ర‌యాణం అత‌ని జీవితాన్నేమార్చేసింది. అందుకే ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో విలువైన వస్తువులు ఉంటే జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation