గుడ్ న్యూస్ 15 నుంచి రైళ్లు నడుస్తాయ్…

21 రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తుండగా, ఈ నెల 15 నుంచి రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. లాక్ డౌన్ కొనసాగినా, పలు కఠిన నిబంధనలు విధిస్తూ, రైళ్లను నడిపించాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది. నిన్న ఉన్నతాధికారులతో సమావేశమైన రైల్వే బోర్డు చైర్మన్, రైళ్లను తిప్పడంపైనే ప్రధానంగా చర్చించారు. అన్ని రైళ్లనూ కాకుండా, ఎంపిక చేసిన మార్గాల్లో, రైళ్లను తిప్పాలని, తద్వారా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని గమ్యాలకు చేర్చవచ్చని వచ్చిన సూచనలకు చైర్మన్ ఆమోదం తెలిపారు. రైలు ఎక్కాలంటే…

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

Indian Railways to adopt HOG system in all LHB Coaches trains

అన్ని రైళ్లలో నాన్ ఏసీ స్లీపర్‌ క్లాస్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైళ్లన్నీ గమ్యస్థానం చేరేలోగా, ఒకటి లేదా రెండు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. కొన్ని రైళ్లు నాన్‌ స్టాప్‌ పద్ధతిలో నడుస్తాయి. ప్రయాణికులు కనీసం 12గంటల ముందు తన ఆరోగ్య పరిస్థితిపై రైల్వే అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. ప్రయాణ సమయంలో వైర‌స్ లక్షణాలు బయటపడితే, అతన్ని మధ్యలోనే దింపేస్తారు.

టాప్ లెస్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసిన కాజల్..

ఇక బెర్త్ ఖరారైన వారికి మాత్రమే ప్రయాణం చేసేందుకు అనుమతి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వయో వృద్ధులను రైలు ఎక్కనివ్వరు. ప్రయాణ సమయానికి కనీసం నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ప్రయాణికులంతా విధిగా సామాజిక దూరం పాటిస్తూ, థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షల అనంతరమే రైళ్లు ఎక్కాలి. ప్లాట్‌ ఫామ్ టికెట్ల విక్రయాలను అనుమతింబోరు.థర్మల్ స్క్రీనింగ్ తరువాత, నామమాత్రపు రుసుము చెల్లించి, గ్లౌజలు, మాస్క్ లను కొనుగోలు చేసి, రైళ్లలోకి వెళ్లాలి. ఇక రైలు బోగీలో క్యాబిన్ లో ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. సైడ్‌ బెర్తులు ఖాళీగానే ఉంటాయి. రైళ్లలో ఏ విధమైన తినుబండారాల విక్రయాలనూ అనుమతించరు. ఈ నిబంధనల మధ్య రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది.

Content above bottom navigation