ట్రంప్ వల్ల ఢిల్లీలో హోటల్ రూమ్ బాయ్ జీవితమే మారిపోయింది… ఏం జరిగిందో తెలిస్తే షాక్ .

భారత పర్యటనకు ట్రంప్ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చాడు ట్రంప్. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమం వెళ్లారు. ఆ తరువాత అహ్మదాబాద్ లో ఉన్న మొతేరా క్రికెట్ స్టేడియంకు వెళ్లారు. అక్కడ నమస్తే ట్రంప్ పోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆగ్రా చేరుకొని తాజ్ మహల్ అందాలను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ చేరుకొని అక్కడ మౌర్య హోటల్ లో బస చేశారు. అయితే ఆ హోటల్ లో ఒక రూమ్ బాయ్ జీవితాన్ని మార్చేశారు ట్రంప్ కుటుంబ సభ్యులు..అసలు ఏమైందంటే..

ఢిల్లీలోని మౌర్య హోటల్ వాతావరణం ట్రంప్ దంపతులకు ఎంతగానమో నచ్చింది. హోటల్ సిబ్బందితో ట్రంప్ ఫామిలీ ఎంతో సరదాగా గడిపారు. ముఖ్యంగా ఇవాంక అక్కడి సిబ్బందితో కలిసి తిరిగి హోటల్ ప్రత్యేకతలు తెలుసుకుంది. వాళ్ళను అడిగి సిటీ వివరాలు మొత్తం తెలుసుకున్నారు. అయితే రోజు రాత్రి పడుకునే ముందు ట్రంప్ కు కాఫీ తాగే అలవాటు ఉంది. దాంతో కాఫీ తెమ్మని హోటల్ యాజమాన్యానికి ఆర్డర్ ఇచ్చారంట. దాంతో ట్రంప్ ఫామిలీ కోసం ఏర్పాటు చేసిన చెఫ్ కాఫీ రెడీ చేసి, రూమ్ బాయ్ తో పంపించాడంట. అయితే కాఫీ తెచ్చిన రూమ్ బాయ్ లో ఏదో తెలియని దిగులు కనిపించిందట. దాంతో సందేహం వచ్చి అతని గురించి పూర్తీ వివరాలు తెలుసుకున్నారు. ముందు అతని మీద సందేహ పడినా, తర్వాత హోటల్ యాజమాన్యం సహాయంతో అతని సమస్యలు తెలుసుకున్నారు. అతని సమస్యలు విని ట్రంప్ ఎంతో విచారణకు గురయ్యారంట.

Image result for trump room boy

దాంతో ట్రంప్, ఆ హోటల్ బాయ్ ను మళ్ళి రూమ్ కు పిలిపించి అతని సమస్యలు తెలుసుకున్నాడంట. ఆ హోటల్ బాయ్ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ఇంట్లో వృద్ధాప్య తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే ఆ రూమ్ బాయ్ కొంత బాధలో ఉన్నాడని తెలుసుకున్నారు. తనకు వచ్చే జీతం వారి హాస్పిటల్ ఖర్చులకే సరిపోతుందని, ఒక్కొక్కసారి డబ్బులు సరిపోక ఎవరినో ఒకరిని అప్పు అడగాల్సి వస్తుందని, చాలా కష్టంగా ఫ్యామిలీని నెట్టుకొస్తున్నానని ఆ రూమ్ బాయ్ చెప్పాడంట. ఉన్నత చదువు చదవాలని ఉన్నా కూడా, కుటుంబ పరిస్థితుల వలన హోటల్ లో రూమ్ బాయ్ గా చేరానని చెప్పాడంట. అతని పరిస్థితి చూసి చలించిపోయిన ట్రంప్, ఇవాంక, వెంటనే వారి పిఏ ను పిలిచి అక్కడికక్కడే ఆర్థిక సహాయం చేసినట్టు సమాచారం. అలా ఒక్క దెబ్బతో అతని సమస్యలు అన్ని తీరిపోయాయి. ట్రంప్, ఇవాంక చేసిన ఈ సహాయం అతని జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏ అధినేత వచ్చినా కూడా హోటల్ బాయ్ తో ఇలా వ్యవహారించరు. కానీ మనిషిని చూసిన వెంటనే అతను ఏదో సమస్యల్లో ఉన్నాడని తెలుసుకుని, వారి హోదాను కూడా మర్చిపోయి, రూమ్ బాయ్ తో మాట్లాడటమే కాకుండా, అతనికి సహాయం చేశారంటే గొప్ప విషయమే కదా. ఇక ఈ వార్త హోటల్ సిబ్బంది అందరికి తెలియడంతో, అందరు ట్రంప్ కుటుంబాన్ని మెచ్చుకున్నారు. ఆ విషయం ఆ నోటా ఈనోటా పడి, సోషల్ మీడియాలోకి ఎక్కడంతో బాగా వైరల్ అయ్యింది.

Content above bottom navigation