భారత్ కు ట్రంప్ వార్నింగ్.. మోడీ ఏం చేసాడో చూడండి

125

మలేరియా నివారేణకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో… ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే… అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ ఈ నిర్ణయం తీసుకోవడంతో… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో వైరస్ పెరిగిపోతున్న సమయంలో… ప్రధాని మోదీని హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఆదివారం ఫోన్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన ట్రంప్… ఆ ప్రతిపాదన ఫలించకపోవడంతో… ఇండియాపై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.వైరస్ పీడ విరగడైన తర్వాత ట్రంప్… భారత్‌‌పై భారీగా వాణిజ్యం సుంకాలు వేస్తారనే అభిప్రాయం వెల్లడవుతోంది.

Donald Trump's 'No Quid Pro Quo' Defense Is Starting to Crack ...
అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

వైరస్‌ని ఆపేందుకు ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రమే సరైన మందుగా ట్రంప్ భావిస్తున్నారు. ఐతే… ఇదే మందు… తమకు అవసరం అని భారత్ భావిస్తోంది. ఐతే… భారత ప్రభుత్వ నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉండటంతో… భారత్-ఆమెరికా మధ్య చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి… భారత్‌ను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. “భారత్ గనగ తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటే మంచిదే, ఒకవేళ ఒప్పుకోకపోతే… అయినా పర్వాలేదు మాకు… కానీ దానికి ప్రతీకారం (retaliation) ఉంటుంది” అని వైట్ హౌస్ దగ్గర ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

అమెరికాకు డ్రగ్ సరఫరా కొనసాగించాలా వద్దా… అనే అంశంపై భారత్ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ తనకు కాల్ చేసినప్పుడు మాత్రం మోదీ… “మేం చేయగలిగింది చేస్తాం” అని మాత్రమే చెప్పారు. తమకు ఈ డ్రగ్ కావాలని మార్చిలో అమెరికా తాజా ఆర్డర్ వేసింది. ఐతే… ఎంత స్థాయిలో కావాలన్నది మాత్రం తెలియలేదు. ఐతే… ప్రపంచంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎక్కువగా తయారుచేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో… కేంద్ర ప్రభుత్వం దాని ఎగుమతిని ఆపేసింది. సరిగ్గా ట్రంప్ కాల్ చేసిన ముందు రోజే… భారత్ ఈ నిర్ణయం తీసుకుందిప్రస్తుతం తమ దేశంలో పెరిగిపోతున్న వైరస్‌ని కంట్రోల్ చెయ్యలేకపోతున్న ట్రంప్… భారత్ లాంటి దేశాల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సమర్థంగా కంట్రోల్ చేస్తున్న ఇండియాకి ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోంది.

Content above bottom navigation