ఢిల్లీలో రోడ్డు మీద కారు ఆపి అక్కడ ఉన్న బీద మహిళ దగ్గరకు వెళ్లి ట్రంప్ ఏం చేశాడో తెలుసా?

95

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది… ఇవాళ మొదట రాష్ట్రపతి భవన్‌కు వెల్లిన ఆయనకు ఘన స్వాగతం లభించింది.. మెలానియా ట్రంప్‌తో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు.. అనంతరం ట్రంప్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాధిపతులు, కాన్సులేట్‌ సభ్యులను ట్రంప్‌ కు రామనాథ్ కోవింద్ పరిచయం చేశారు. అందరినీ పరిచయం చేసే క్రమంలో.. మొదట, ప్రధాని నరేంద్ర మోడీని చూపుతూ మా ప్రధాని అని చెబుతుండగా, నరేంద్ర మోడీని నాకు పరిచయం చేస్తున్నారా? అన్నట్టుగా ట్రంప్‌ జోకులు వేసినట్టు ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది. అనంతరం మహాత్మ గాంధీకి నివాళులర్పించేందుకు రాజ్ ఘాట్ కు బయల్దేరారు ట్రంప్.

అయితే మహాత్మగాందీకి నివాళులు అర్పించడానికి వెళ్తున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ రోడ్డు మార్గంలో కారులో వెళ్తుంటే ఒక విషాదకర ఘటనను ఆయన చూశారు. రోడ్డు మధ్యలో ఒకరిద్దరు మహిళలు చిన్న పిల్లలను ఎత్తుకుని ట్రంప్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. కారులో వెళ్తున్న ట్రంప్ వీరిని గమనించి కారును రోడ్డు మీద ఆపారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇండియాలో కేవలం నేను ఆథిత్యాన్ని స్వీకరించడానికే రాలేదు. ఇక్కడి ప్రజల గురించి పూర్తీగా తెలుసుకోడానికి వచ్చానని ఆ సందర్భంగా అన్నాడు. ఈ ఘటనను చూసి అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అమెరికా అధ్యక్షుడు అయ్యి ఉండి, ఇలా రోడ్డు మీద కారు ఆపి, సాధారణ జనంతో మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Image result for trump car india

ఇక ఆ తర్వాత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించడానికి బయలుదేరి వెళ్లారు. సమాధి వద్ద పుష్ఫ గుచ్ఛం ఉంచి.. ఒక ప్రదక్షిణ చేసి గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం వహించారు. ట్రంప్, మెలనియా దంపతులకు అధికారులు రాజ్‌ఘాట్ గురించి వివరించారు. సమాధిని సందర్శించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసి సంతకం చేశారు. అనంతరం మెలనియా కూడా సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అనంతరం అధికారులు మహాత్మాగాంధీ జ్ఞాపికను ట్రంప్ దంపతులకు అందజేశారు. అనంతరం రాజ్ ఘాట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొక్కను నాటారు. ఆ తర్వాత రాజ్‌ ఘాట్ నుంచి ట్రంప్ నేరుగా హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్నారు. ఇక్కడే భారత్, అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇక మెలనియా ట్రంప్, ఢిల్లీ నానక్‌పురలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సర్వోదయ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్‌ను సందర్శించి.. ‘హ్యాపీనెస్ క్లాస్’ ప్రోగ్రాం అమలవుతున్న తీరును ఆమె పరిశీలించారు. మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు ట్రంప్‌కి రాష్ట్రపతి కోవింద్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మొత్తం 90 మంది అతిథులు పాల్గొనున్నారు.

Content above bottom navigation