హీరోయిన్ కంటే అందం, వందల కోట్ల ఆస్తి.. కానీ చేసిన ఒక్క తప్పు ఆమె జీవితాన్ని నాశనం చేసింది.. ఏం చేసిందో తెలిస్తే షాక్

161

కోట్ల ఆస్తి, పిలిస్తే వెంటనే వచ్చే పనివాళ్ళు, పైగా హీరోయిన్ కంటే అందంగా ఉంటుంది. కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు, అన్నలు.. కానీ ఇవేమి ఆమెకు తృప్తి ఇవ్వలేదు. సమాజంలో ఈ మధ్య బాగా ఎక్కువవుతున్న అక్రమ సంబంధ కూపంలో ఆమె కూడా దూరింది. కట్టుకున్న భర్తకు విడాకులు ఇచ్చి ప్రియుడిని కలుస్తుంది. చివరికి ఆమె జీవితం ఏమైంది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ లోని రాజ్ కోట్ లో బిసువాలా అనే శ్రీమంతుడు నివాసం ఉంటున్నాడు. ఇతను రాజ్ కోట్ లో పేరుమోసిన వ్యాపారవేత్త. ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు బిరేన్ వాలా, రిజ్విర్ అనే ఇద్దరు కుమారులతో పాటు పూనమ్ వాల అనే కుమార్తె ఉంది. బిసువాల తన కుమార్తెకు ముంబైలో శ్రీమంతుల కుటుంబంలో ఓ పెళ్లి సంబంధం చూసి, ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేశాడు. ఏడేళ్ల నుంచి పూనమ్ ముంబైలో భర్తతో కలిసి కాపురం ఉండేది. బిసువాల, ఆయన ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు ముంబై వెళ్లి పూనమ్ ను చూసి వచ్చేవారు. కుటుంబ సమస్యలు ఉన్నాయంటూ ఇటీవల పూనమ్ చట్టపరంగా తన భర్తతో విడాకులు తీసుకుంది. తరువాత ముంబై నుంచి రాజ్ కోట్ చేరుకుని తల్లిదండ్రుల ఇంటిలోనే నివాసం ఉంటున్నది.

Image result for హీరోయిన్ కంటే అందం, వందల కోట్ల ఆస్తి

శ్రీమంతులు కావడంతో పూనమ్ కు ప్రత్యేకంగా కారు తీసిచ్చారు. ప్రతి రోజు పూనమ్ ఇంటి నుంచి కారులో బయటకు వెలుతోంది. డ్రైవర్ ను వెంట తీసుకుని వెళ్లాలని చెప్పినా పూనమ్ మాత్రం ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లేది. పూనమ్ తన స్నేహితులను కలవడానికి వెలుతోందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజ్ కోట్ లోనే తల్లిదండ్రులు, సోదరులకు తెలీకుండా ఆమె ప్రియుడితో కలిసి ప్రత్యేకంగా ఇంటిని తీసుకుని ప్రతి రోజు పగలు అక్కడే గడపడం మొదలుపెట్టింది. రాత్రి అయ్యే సరికి ఆమె ఇంటికి చేరుకునేది.

Image result for హీరోయిన్ కంటే అందం, వందల కోట్ల ఆస్తి

పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని ఆమె సోదరులు బిరెన్ వాలా, రాజ్విర్ లకు తెలిసింది. అక్రమ సంబంధం కోసమే భర్తకు విడాకులు ఇచ్చిందని కక్ష పెంచుకున్నారు. జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ అనే ముగ్గురితో కలిసి పూనమ్ ను హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు. అందరు కలిసి రాజ్ కోట్ లోని రాష్ట్రీయ కళా కేంద్రం సోసైటిలోని సొంత ఇంటిలో పూనమ్ ను కిడ్నాప్ చేశారు. తరువాత జస్ధాన్ గ్రామంలోని తమ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లారు. ఇద్దరు సోదరులు మరో ముగ్గురితో కలిసి పూనమ్ తో బలవంతంగా విషం తాగించారు. ఐదు మంది కలిసి పూనమ్ కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకోవడంతో శరీరం మొత్తం విషం వ్యాపించి ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఈ క్రింది వీడియో చూడండి

పూనమ్ అంత్యక్రియలు కూడా అదే ఫాం హౌస్ లో పూర్తి చేసి, సాక్షాలు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. పూనమ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు డీసీబీ (క్రైం బ్రాంచ్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు అనుమానం వచ్చి పూనమ్ సోదరులు బిరెన్ వాలా, రిజ్విర్ లను విచారించారు. వారు పొంతనలేని సమాదానం ఇవ్వడంతో వారిని గట్టిగా విచారించారు. పూనమ్ చూడటానికి సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది. పూనమ్ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే తాము పరువు హత్య చేశామని ఆమె సోదరులు బిరెన్ వాలా, రిజ్వర్ అంగీకరించారు. పూనమ్ హత్య కేసులో మిగిలిన ముగ్గురు జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ (కిరాయి హంతకులు) అజ్ఞాతంలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation