దిల్లీలో జరిగిన ప్రార్ధనలు ఏమిటి ఎంతమందికి సోకింది ఏం జరిగిందంటే

121

కరోనా కట్టడి విషయంలో తాము అనుసరిస్తున్న విధానాల గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పనిగా వివరిస్తుంటారు. ‘‘మన దేశంలో ఈ వైరస్ లేదు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే వస్తుంది. అలా వచ్చే వారు విమానాలు.. నౌకల ద్వారా వస్తుంటారు. ఎయిర్ పోర్టులు బంద్ అయ్యాయి. పోర్టులు నిలిచిపోయాయి. అంటే.. విదేశాల నుంచి వచ్చేవారే లేరు. ఇప్పటికే వచ్చిన వేలాదిమందిని ఐసోలేషన్ చేయించాం. ఇక.. కొత్తగా వచ్చేదేముంది?’’ అంటూ ప్రశ్నించటం ద్వారా.. కరోనాను విజయవంతంగా నిలువరించినట్లుగా చెప్పారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ పాయల్ ఘోష్

Two thousand people attended Markaz Izzima in Nizamuddin in Delhi

ఆయన థియరీ లాజికల్ గా ఉండటంతో.. నిజమే.. కరోనా భూతాన్ని నిలువరించటంలో సక్సెస్ అయినట్లేనన్న నమ్మకం చాలామందికి జరిగింది. ఈ థియరీలో మిస్ అయిన పాయింట్ ఏమంటే.. విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి దేశ వ్యాప్తంగా ఏదైనా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారా? ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే.. వారి పరిస్థితి ఎలా ఉంది? అన్న ప్రశ్నల్ని వేసుకోవటం మర్చిపోయారు. దీనికి సంబంధించిన వార్నింగ్ బెల్ శుక్రవారమే మోగింది.శుక్రవారం రాత్రి వేళలో లకడ్డీకాపూల్ లోకి ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో వైద్య అధికారులు అలెర్ట్ అయ్యారు. ఒక పెద్ద వయస్కుడు మరణించారని.. ఆయన ఎదుర్కొన్నవన్నీ కరోనా లక్షణాలతో మ్యాచ్ అయ్యాయని.. అయితే..అతడికి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేదని చెప్పటంతో.. పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆసుపత్రి నుంచి ఫోన్ రావటంతో.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వెళ్లి మరణించిన వ్యక్తిని గాంధీకి తరలించి.. పరీక్షలు జరిపారు. అనూహ్యంగా సదరు వ్యక్తి కరోనాతో మరణించినట్లు గుర్తించారు.

Outlook Photo Gallery : Pilgrims circle the Kaaba, the cubic ...
సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

ఒక్కసారి ఉలిక్కిపడిన తెలంగాణ ప్రభుత్వం.. వెంటనే స్పందించి.. అతడి ట్రావెల్ హిస్టరీ మీద ఆరా తీయగా.. ఈ నెల 13-15 మధ్యన ఢిల్లీలోని నిజాముద్దీలో భారీ ఎత్తున మర్కజ్ ప్రార్థనలు జరిగినట్లుగా గుర్తించారు. దీనికి మొత్తం 75 దేశాల నుంచి ఎనిమిదివేల మంది వరకూ హాజరైనట్లుగా గుర్తించారు. ఇండోనేషియా.. మలేషియా.. సౌదీ.. కజకిస్థాన్ ఇలా చాలా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలా హాజరైన విదేశీయుల సంఖ్య ఏకంగా రెండు వేలుగా చెబుతున్నారు.మరింత షాకింగ్ అంశం ఏమంటే.. ప్రార్థనలు ముగిసిన తర్వాత కూడా పలువురు ప్రార్థనలు నిర్వహించిన వేదిక దగ్గర్లోనే బస చేశారని.. ఆరు అంతస్తుల డార్మటరీల్లో 280 మంది విదేశీయులు ఉన్నట్లుగా తేలింది. అక్కడున్న మొత్తం 300 మందికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా తేలింది. అనారోగ్యంగా ఉన్న 75 మందిని ఆదివారమే ఢిల్లీలో గుర్తించారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి..ఒకేచోట వందల మంది ఎలా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. ఈ ప్రార్థనలు జరిగిన స్థలం నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ను అనుకునే ఉండటం. ఇప్పుడీ చుట్టుపక్కల ప్రాంతాల్ని చుట్టుముట్టిన పోలీసులు.. ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 200 మందిని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ప్రాధమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రార్థనలకు తెలంగాణ నుంచి దగ్గర దగ్గర 300 మంది హాజరైతే.. ఏపీ నుంచి దగ్గర దగ్గర 500 మంది హాజరైనట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇప్పటివరకూ ఉన్న అంచనాలు మారిపోయి.. కొత్త ఆందోళన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మొదలైంది. ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు.. గడిచిన కొద్ది రోజులుగా ఎంతమందిని కలిశారు? వారు మళ్లీ ఇంకెంతమందిని కలిశారు? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. ఈ లెక్క ఇప్పుడు కొత్త పరిణామాలకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.

Content above bottom navigation