గొడుగులు వాడండి.. కరోనాకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన

129

ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది కరోనా వైరస్. దీని భారిన పడి వేలమంది చనిపోతున్నారు. లక్షల సంఖ్యల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే మన ఇళ్లలో ఉండే గొడుగు కరోనా వైరస్‌ను ఆపగలదంటే నమ్మగలరా. ఇది పూర్తిగా ఆపలేకపోవచ్చు… బట్ గొడుగు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే… సోషల్ డిస్టాన్స్ లేదా సామాజిక దూరం మనం పాటించాలన్నా, ఇతరులు పాటించేలా చెయ్యాలన్నా… మన దగ్గర గొడుగు ఉంటే… అది సాధ్యమవుతుంది. ఇదెలా వాడాలో విశాఖకు చెందిన డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

We tested out an anti-UV umbrella to see how much it cools us down ...
సెగలు పుట్టిస్తున్న నేహా దేశ్ పాండే

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిపుణులు పలు జాగ్రత్తలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. జన సంచారం ఉన్న చోటకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లినా మరో వ్యక్తికి కనీసం మూడు అడుగుల దూరం ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాక, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, లేదా శానిటైజర్లను వాడాలని నిర్దేశిస్తున్నారు. చేతులతో ముఖం, కళ్లు, ముక్కు వంటివి తాకవద్దని గట్టిగా చెబుతున్నారు. అయితే, ఈ జాగ్రత్తలతో పాటు కరోనా బారిన పడకుండా ఉండేందుకు మరో చిట్కాను కూడా నిపుణులు సూచిస్తున్నారు. కరోనా దరిచేరకుండా కట్టడి చేయడానికి ప్రతి వ్యక్తికి గొడుగులు బాగా ఉపయోగపడతాయని వెల్లడించారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన సామాజిక దూరానికి (సోషల్ డిస్టెన్స్) సరిగ్గా సరిపోయే సిద్ధాంతమని విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు వెల్లడించారు. సామాజిక దూరంలో (సోషల్ డిస్టెన్స్) భాగంగా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా కనీసం 3 అడుగుల దూరాన్ని కచ్చితంగా పాటించాలి. అయితే, ఈ నిబంధనను పాటించడం చుట్టుపక్కల వ్యక్తులపైన కూడా ఆధారపడి ఉంటుంది.

యాంకర్ మంజూష హాట్ హాట్ అందాలు చూస్తే తట్టుకోలేరు

ఈ క్రమంలో ప్రతి ఒక్కరు గొడుగు వాడితే కచ్చితంగా ఒకరినుంచి మరొకరు కనీసం మీటరు దూరం పాటించే అవకాశం ఉంటుందని సూర్యారావు వెల్లడించారు. గొడుగు ఉపయోగించడం వల్ల ఒకవేళ ఎదుటివారు తుమ్మినా లేదా దగ్గినా వారి నుంచి వచ్చే ఆ తుంపర్లను గొడుగు నిరోధిస్తుంది. ఈ గొడుగే మన చుట్టూ రక్షణ కవచంలా పని చేస్తుంది. ఇక బయటికి వెళ్లి మళ్లీ ఇంటికి రాగానే, ఆ గొడుగును ఎండలో ఉంచడం లేదా శానిటైజర్‌తో మళ్లీ శుభ్రం చేసుకోవచ్చు. జనసంచారం, గుంపులు ఎక్కువగా ఉండే రైతు బజార్లలో, దుకాణాల దగ్గర ఇలా చేయొచ్చు. చుట్టూ జనం లేనప్పుడు కూడా గొడుగు వాడొచ్చు. తద్వారా ఎండ తీవ్రత నుంచీ తప్పించుకోవచ్చు. ఐతే ఈ రోజుల్లో ఎండ పడటమే మేలు. ఎందుకంటే మన డ్రెస్‌పై వైరస్ ఉంటే ఎండ వల్ల అది చచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల చుట్టూ జనం లేనప్పుడు గొడుగు వాడకుండా ఎండకు ఛాన్స్ ఇచ్చేస్తే సరి అంటున్నారు డాక్టర్ సూర్యారావు.

Content above bottom navigation