జగ్గీ వాసుదేవ్‌ దొంగబాబా.. బయటపడ్డ సంచలన విషయాలు

215

అత్యంత సుందరంగానే కాకుండా ప్రత్యేకమైన కొలతలతో రూపొందించిన ముఖాకృతితో భూమ్మీద ఉన్న విగ్రహాలన్నింటిలోను అతి పెద్ద ముఖం కలిగిన విగ్రహంగా కోయంబత్తూర్ స‌మీపంలోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టింప‌చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త జ‌గ్గీవాసుదేవ్‌. లాభాపేక్ష లేకుండా నడిచే ఈషా సంస్థ ఇండియా, అమెరికా, ఇగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది, అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితియొక్క ఆర్ధిక, సామాజిక సంస్థ కి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. వీరి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో వీరికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అలాంటి వాసుదేవ్ బాబాపై ఊహించ‌ని వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ ప్రముఖ ఆధ్యాత్మిక గురువుపై మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్‌ గా ప్రసిద్ధి చెందిన రాజేంద్రసింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. జగ్గీ వాసుదేవ్‌ తనను తాను సద్గురువుగా చెప్పుకోవచ్చని, వాస్తవానికి ఆయన దొంగబాబా అని విమర్శించారు. నీటిహక్కు చట్టంపై మంగళవారం జరుగబోయే సెమినార్‌లో పాల్గొనేందుకు భోపాల్‌కు చేరుకున్న రాజేంద్రసింగ్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. నదుల పునరుజ్జీవనానికి మిస్డ్‌కాల్‌ ఇవ్వండి అంటూ జగ్గీ వాసుదేవ్‌ గతంలో నడిపించిన ప్రచారంపై నిప్పులు చెరిగారు.. ‘ఎంత మోసం ఇది. మిస్డ్‌ కాల్స్‌ తో నదులు పునరుజ్జీవనం అవుతాయా?’ అని ఆయన ప్రశ్నించారు. జగ్గీ వాసుదేవ్‌ తన భార్యను కూడా హత్యచేశారని ఆరోపించారు. వినోభాభావే భూదాన ఉద్యమం కింద కోయంబత్తూర్‌లో రైతులకు పంపిణీ చేసిన భూములను జగ్గీ వాసుదేవ్‌ కబ్జా చేశారని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తున్నదని తెలిపారు. ఈ ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేకెత్తించాయి. కాగా, నీటి హక్కు చట్టంపై జరుగబోయే సెమినార్‌లో పాల్గొనేందుకు భోపాల్‌కు చేరుకున్న రాజేంద్రసింగ్‌ మీడియాతో మాట్లాడుత ఈ కామెంట్లు చేశారు.

జగ్గీ వాసుదేవ్‌.. దొంగబాబా

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న కంప్యూటర్‌ బాబాపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అధికారం కోసం తహతహలాడేవారు నదులను రక్షించలేరని, ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేస్తేనే అది సాధ్యమవుతుందని రాజేంద్ర సింగ్ అన్నారు. రాజేంద్రసింగ్‌ ఆరోపణలను ఈశా ఫౌండేషన్‌ ఖండించింది. ఆ ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని తెలిపింది. మతిస్థిమితం లేకపోవడం వల్ల లేదా ఈ విధంగా పేరుపొందాలనే నీచ ఆలోచన వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని విమర్శించింది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation