ప్రణయ్ ను హత్య చేయించడానికి మారుతీరావు డబ్బు ఎలా ఇచ్చాడో తెలుసా ..?

134

రెండు తెలుగు రాష్టాల్లో ఎంతో సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకి సంబంధించిన కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ కులం వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న కోపం తో మారుతీరావు ఆల్లుడైన ప్రణయ్ ని కిరాయి హంతకుల చేత హత్య చేయించిన విషయం తెలిసిందే. తాజాగా మారుతీరావు కూడా ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇతని ఆత్మహత్యతో మారుతీరావు టాపిక్ రెండు తెలుగురాష్ట్రల్లో మరొకసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇతని చావుతో అయినా ప్రణయ్ హత్యకు పులుస్టాప్ పడుతుందా అని అందరు అనుకున్నారు. కానీ ఈ కేసులో ఇంకా ఆరుగురు నిందితులు ఉన్నారు. వీరికి తప్పకుండ శిక్ష పడాలని ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కోరుకుంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇకపోతే నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం ప్రణయ్ హత్య కేసును విచారించింది. ఈ కేసులో పోలీసులు ఫైల్ చేసిన చార్జిషీటుపై ఈ మేరకు కోర్టు దృష్టిసారించింది. కూతురు వేరే కులం వాణ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో రగిలిపోయిన మారుతిరావు.. తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మేసి మరీ ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చినట్లు చార్జిషీటులో పోలీసులు పొందుపరిచారు. కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించడానికి చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గరున్న 2,025 గజాల స్థలాన్ని రూ. 2 కోట్లకు విక్రయించారు. మారుతీరావు డబ్బు సమకూర్చుకున్నాకా, తన మిత్రుడు కరీం ద్వారా ఉగ్రవాది బారీని సంప్రదించాడు. అతడి ద్వారా అస్గర్‌ అలీ పరిచయం అయ్యాడు. ప్రణయ్‌ హత్య కోసం అస్గర్‌ అలీకి రూ. 15 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చారు. రాజమండ్రి జైలులో తనకు పరిచయమైన బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ అస్గర్‌ అలీ ఆ పనిని అప్పగించాడు. తొలుత ప్రణయ్‌ ను 2018 సెప్టెంబరు 12న వినాయకచవితి సందర్భంగా గణేశ్‌ విగ్రహం కొనే సందర్భంలో మిర్యాలగూడలో చంపేయాలని సుభాషశర్మ స్కెచ్‌ వేశాడు. ఆ రోజు అక్కడ రద్దీ అధికంగా ఉండటంతో కుదరలేదు. అదే సమయంలో గర్భవతిగా ఉన్న అమృత తన తల్లికి ఫోన్‌ చేసి.. 14వ తేదీన ఆస్పత్రిలో చెక్‌పకు వెళ్తున్నట్లు చెప్పింది. మారుతీరావు ఆ విషయాన్ని బారీకి చేరవేశాడు. దీంతో.. హైదరాబాద్‌లో ఉన్న సుభాష్ శర్మ హుటాహుటిన మిర్యాలగూడకు చేరుకున్నాడు. అస్గర్‌అలీ, ఆటోడ్రైవర్‌ నిజాంతో కలిసి ఆటోరిక్షాలో.. సుభాష్ శర్మ ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్లారు. సుభాష్ శర్మ అదును చూసుకుని ప్రణయ్‌ను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత ఆ ముగ్గురూ త్రిపురారం మీదుగా నల్లగొండకు వెళ్లారు. సుభాష్ శర్మ హత్యకు ఉపయోగించిన కత్తిని ఎన్‌ఎసిపి కెనాల్‌ లో పారేశాడు.

Image result for ప్రణయ్ ను హత్య చేయించడానికి మారుతీరావు

హత్య కేసులో ఏ2గా ఉన్న మారుతిరావు సోదరుడు శ్రవణ్ ఈ విషయాలను పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 1200 పేజీలతో కూడిన ఛార్జ్ షీటును దాఖలు చేశారు. అందులో 102 మంది సాక్షుల స్టేట్మెంట్లను పొందుపర్చారు. ఛార్జ్ షీట్ దాఖలు కావడంతో కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ అయింది. ఏ1 మారుతిరావు శనివారం హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోగా ఏ2 శ్రవన్ మంగళవారం నాటి కోర్టు విచారణకు హాజరు కాలేదు. మిగతా ఆరుగురు నిందితులులను పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత సమాజంలో తలెత్తుకోలేక పోయానని పెళ్లి తర్వాత కూడా బంధువులతో రాయబారం పంపినా అమృత దిరిగిరాలేదు కాబట్టే ప్రణయ్ ని చంపాలనుకున్నానని, హత్య చేయించేందుకు కావాల్సిన డబ్బును శ్రవణ్ ఏర్పాటు చేశాడని మారుతిరావు చెప్పినట్లు స్టేట్మెంట్ లో రికార్డయింది. అయితే ఈ కేసులో ప్రధాన పాత్ర వహిస్తున్న అమృత తన తండ్రికి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్ మెంట్ కీలకంగా మారింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి ముందే అమృతని తన దారిలోకి తెచ్చుకుని స్టేట్ మెంట్ ను తప్పుడు ప్రయత్నంగా చిత్రీకరించేందుకు మారుతిరావు చేయని ప్రయత్నాలు లేవు. కానీ అమృత ఎంచెప్పినా కూడా లొంగకపోవడంతో ఆయన హైదరాబాద్ కి లాయర్ ను కలవడానికి వచ్చి అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation