కిస్సింగ్ పవర్ ఎంతో తెలుసా ముద్దు గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు…

ముద్దు అనేది శృంగారంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది..ముద్దు పెట్టుకోవడం వలన కొన్ని కాలరీలు ఖర్చయి మన శరీరాన్ని ఉల్లాసంగా ఉంచడంలో తోడ్పడతాయి..శృంగారంలో ముద్దు పెట్టుకోవడం అనేది మొదటి భాగంగా చెప్పుకోవచ్చు..జంటల మధ్య శృంగారం ముద్దుతోనే మొదలవుతుంది..ఈ ఘాడ చుంబనం వాలన ఇద్దరి మధ్య రసాయనాలు విడుదలయి అసలు శృంగారానికి మరింత ప్రోత్సాహ కరంగా మారుతుంది…ముద్దు గురించిన పూర్తి వివరాలను ఈ వీడియొలో చూసి తెలుసుకోండి..

Image result for lovers

ముద్దు పెడితే శరీరం లోపల కొన్ని రసాయన మార్పులు ఏర్పడతాయని పరిశోధనలు చెబుతున్నాయి…పరిశోధకుల అధ్యయనంలో భాగంగా ముందుగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన కొన్ని ప్రేమ జంటల్లో ముఖ్యంగా కాలేజీ విద్యార్దులను వెదికి పట్టుకున్నారు..వీరందరినీ ఒక గదిలో ఉంచి మంద్ర స్థాయిలో మంచి సంగీతం వినిపిస్తూ వారి వారి భాగస్వాములను ముద్దు పెట్టుకోమని చెప్పారు..ఇంకేముంది అంత మంచి అవకాశాన్ని వదులుకోలేని ప్రేమ జంటలు ఒక 15 నిమిషాల పాటు ముద్దుల్లో మునిగిపోయారు..ఈ లోపు పరిశోధకులు తమకు రావాల్సిన సమాచారాన్ని రాబట్టుకున్నారు..ప్రేమ జంటలు ఘాడ చుంబనంలో ఉండగా వారి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే రసాయనం ప్రేమ బందాలను గట్టి పడేలా చేస్తుంది..

కార్టిసోల్..ఆందోళనకు కారణమయ్యే రసాయనం..రసాయనాల మోతాదును పరిశోధకులు లెక్క కట్టారు.. పరీక్షకు ముందు తరువాతి మోతాదును పోల్చి చూసారు…చివరకు వీరి పరిశోధనల్లో తేలింది ఏమిటంటే ముద్దు తరువాత యువతీ యువకులిద్దరిలోనూ కార్టిసాల్ విడుదల బాగా తగ్గిపోయిందని ఫలితంగా వారిలో మానసిక ఒత్తిడి దూరమయిందని తెలుసుకున్నారు..అలాగే యువకుల్లో ఆక్సిటోసిన్ విడుదల పెరిగిందని గమనించారు.. అదే సమయంలో యువతుల్లో ఆక్సిటోసిన్ విడుదల తగ్గిపోయిందని గమనించారు..ఇదిలా ఉంచితే అబ్బాయిల్లో సంతోషాన్ని పెంచే ఆక్సిటోసిన్ అమ్మాయిల్లో తగ్గిపోవడానికి కారణం అంతుపట్టడం లేదు..ఏది ఏమైనప్పటికీ ప్రేమ బంధం బలపడేందుకు ముద్దే ప్రధాన పాత్ర పోషిస్తుందని వారు తేల్చేసారు..ముద్దు ద్వారా ప్రేమ జంటల నడుమ అనుబందం శృంగార భరిత ప్రేమ ఒకరినొకరు కావాలనుకునే కోరిక మరింతగా బలపడతాయని స్పష్టం చేసారు..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి…

Content above bottom navigation