కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తులు కోలుకున్న తర్వాత మళ్లీ ఈ మహమ్మారి బారిన పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్‌కు చెందిన పరిశోధకులు ఇలాంటి కేసును గుర్తించారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన 33 ఏళ్ల ఓ యువకుడు ఆగష్టు నెలలో స్పెయిన్ వెళ్లొచ్చాడు.
ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ చేయగా అతడికి పాజిటివ్ అని తేలింది. అతడు మార్చి నెలలోనే తొలిసారి కోవిడ్ బారిన పడ్డాడని డాక్టర్ కెల్విన్ కై వాంగ్ తో అనే మైక్రోబయాలజిస్ట్ తెలిపారు.