గుడిలో నంది చేసిన అద్భుతం సైంటిస్టులకే చెమటలు పట్టించాయి

1263

మన దేశంలో గంగానది అన్నీ నదుల కంటే పెద్దది దేవ దేవతలు నడయాడిన ఈ పుణ్య భూమిలో, గంగానది పుట్టుక నుంచి గంగానది పరీవాహక ప్రాంతం అంతాఓ ప్రాచుర్యం పొందిన పుణ్యస్దలం. అయితే ఇంకా ఎన్నో ఉపనదులు ఉన్నాయి. అలాగే మన దేశంలో పెద్ద నదులు 10కి పైగా ఉన్నాయి.అలాగే మనకు కృష్ణానది కూడా ఉంది, అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ పుడమిపై పరుగులు పెడుతోంది కృష్ణమ్మ. దక్షిణభారతదేశంలో రెండవ పెద్దనది కృష్ణానది అనే చెప్పాలి… మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, మహాదేవ్ పర్వత శ్రేణిలో కృష్ణానది జన్మించింది. అయితే ఈ నది జన్మస్థలాన్ని పంచగంగ అని అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఐదు నదులకు జన్మస్థలంగా చెబుతారు. అంతేకాకుండా పర్వతశ్రేణిలో ఒక ఆలయంలో ఉన్న నంది నోటి నుండి వచ్చే నీరే కృష్ణానదిగా వచ్చింది అని చెబుతారు… ఇక్కడే శివుడి, శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్నాయి… మరి ఈ కృష్ణానది, ఇక్కడ ఉన్న ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Image result for krishna-nadhi-ga

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా ఉన్న మహాదేవ్ పర్వత శ్రేణిలో కృష్ణానది జన్మించింది, చిన్నధారగా మొదలై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక తరువాత ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి దివిసీమలో బంగాళాఖాతంలో కృష్ణానది కలుస్తుంది. భారతదేశంలో నాలుగవ పెద్ద నదిగా చెప్పబడే కృష్ణానది మొత్తం పొడవు 1400 కీ.మీ. ఇక కృష్ణానదిని తెలుగు ప్రజలు కృష్ణవేణిగా పిలుచుకుంటారు, మహారాష్ట్రలో కృష్ణానది జన్మించిన స్థలంలోనే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని కృష్ణబాయి ఆలయమని పిలుస్తారు. అయితే 17 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి కొలువై ఉన్నాడు.

ఇక్కడే మహాదేవుని ఆలయం ఉంది. ఇక్కడే వెన్న, సావిత్రి, గాయత్రీ, క్వయిన అనే నదులతో కలిపి మొత్తం ఐదు నదులు జన్మించినట్లుగా చెబుతారు. అయితే వెన్నానది కొంత దూరం ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్నా ఈ రెండు నదులు కలసి కృష్ణవేణి నదిగా ముందుకు ప్రవహించగా, కోయినానది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడే గోముఖం నుండి ఎప్పుడు నీరు అనేది వస్తుంటుంది. ఇక్కడ గోముఖం నుండి వచ్చే నీరే ఐదు నదులకు ప్రతిరూపమని చెబుతారు.ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలులోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటె ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంద్రాలు ఉండగా, ఇవి ఒకదానికి ఒకటి ఆరు అగుడుల దూరంలో ఉన్నాయి. ఈ ఒక్కో రంద్రం గుండా నీరు ఎపుడు వస్తూ ఉంటుంది. అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుకవైపు ఉన్న కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ, ఈ రంద్రాల గుండా కాలువలోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణానదిగా ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ అని అంటారు. చూశారుగా కృష్ణమ్మ పుట్టుక మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation