శివుడితో శృంగారం చేసిన మండోదరి ఏమైందో తెలుసా

576

మండోదరి రామాయణంలో రావణాసురుని భార్యగా మ‌న‌కు తెలుసు..ఈమె మహా పతివ్రత. మండోదరి విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ..హేమకు గలిగిన పుత్రిక.మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరించే వేళ వేటకై రావణుడు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తాను అవివాహితుణ్ణి కాబట్టి తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని రావణుడు కోరుకుంటాడు.ఆ స‌మ‌యంలో అత‌ను ఏం చేశాడు, మండోద‌రి వివాహ‌నాకి మ‌ధ్య‌లో ఏం జ‌రిగింది.అలాగే మండోధ‌రికి పంచ‌క‌న్య‌ల‌కు సంబంధం ఏమిటి? పురాణాల్లో మ‌హ‌ప‌తివ్ర‌త‌లో మండోద‌రి ఎలా చేరింది?మ‌రి మండోద‌రి పార్వ‌తికి తెలియ‌కుండా శివుడితో సంభోగం చేయ‌డం ఈ విష‌యం పార్వ‌తికి తెలియ‌డంతో ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for శివుడితో శృంగారం చేసిన మండోదరి

మండోధ‌రి మ‌ధుర అంశ …ఆమె ఓరోజు కైలాసానికి వెళుతుంది ఆ స‌మ‌యంలో శివుడు మాత్ర‌మే ఉంటాడు.. అక్క‌డ పార్వతీ దేవి ఉండ‌దు.. ఈ స‌మ‌యంలో శివుడితో ఆమె సంభోగిస్తుంది, అయితే శివుడి విభూది ఆమెకి అంటుకుంటుంది, దీనిని ప‌సిగ‌ట్టిన పార్వ‌తీ దేవి ఆమెని శ‌పిస్తుంది..12 సంవత్స‌రాలు క‌ప్ప‌గా ఉండాల‌ని శ‌పిస్తుంది, 12 సంవ‌త్స‌రాల క‌ప్ప రూపం త‌ర్వాత అస‌లు రూపం వ‌స్తుంది అని శ‌పిస్తారు. అలా అసుర‌రాజుకి ఆమె జ‌న్మిస్తుంది.అలామయబ్రహ్మ..హేమకి ఆమె జ‌న్మిస్తుంది, ఓరోజు ఆమెని చూసిన రావ‌ణుడు మండోద‌రిని వివాహం చేసుకుంటాను అని కోర‌తాడు.. …మయుడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపించాడు. అందుచే ఈమె రావణాసురుని పట్టమహిషి అయింది. ఎంతో అందం ఆమె సొంతం… కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమే గాదు మండోదరి అంతస్సౌందర్యం కూడా క‌లిగిన గొప్ప ప‌తివ్ర‌త‌. అంతేకాదు రావణునిచే వరింపబడింది. నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని ప్రభోధం చేయగల మనస్తత్వం గలది.

Image result for శివుడితో శృంగారం చేసిన మండోదరి

మండోదరి అంటే పేరు అలాగ ఉంటుంది కాని…దాని అర్ధం, మండనం యస్యస ఉదరం. అంటే సన్నని నడుము గలది అని అర్ధం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలది అని చెప్పాలి… భూమి వంటి ఉదరము అంటే సంతాన సాఫల్యత గల ఉదరము అని చెబుతారు.ఇక మ‌న పురాణాల్లో అత్యంత ప‌తివ్ర‌త‌లు అంటే పంచ‌క‌న్య‌ల‌ను చెబుతారు.. అందులో మండోద‌రి ఓ సౌంద‌ర్య‌వ‌తి..మండోదరి అహల్య, తార, సీత, ద్రౌపదితో కలిసి పంచ కన్యగా ప్రసిద్ధి చెందింది. విచిత్రమేమిటంటే, ఈ అయిదుగురు స్త్రీలు తమ భర్తలతో ఏదో విధంగా సంబంధాలు చెడిన వారే. అహల్యని గౌతమ ఋషివెళ్ళగొట్టాడు. దానికి కార‌ణం పర పురుష సంబంధం ఉందన్న కారణంతో..ఇక తార తన భర్త వాలి చనిపోయిన తరువాత అతని సోదరుడైన సుగ్రీవుడిని వివాహం చేసుకుంది..సీత చెప్పుడు మాటలు విన్న రాముడి చేత వెళ్ళ గొట్టబడింది, ఇక ద్రౌపదికి అయిదుగురు భర్తలు చివ‌ర‌కు ఆమెను జూదంలో ఒడ్డి పోగొట్టుకున్నారు. అయితే మండోదరి మాత్రం ఒక అసురుని భార్యగా మాత్రమే తెలుసు.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక రావ‌ణుడు త‌ను అత్యంత శ‌క్తివంతుడు అవ్వాలి అని ఓరోజు త‌లుస్తాడు, ఈ స‌మ‌యంలో రుషుల‌ని వ‌దించి ఆ ర‌క్తాన్ని పాల‌ల్లో క‌లిపి తాగితే ఎంతో శ‌క్తి వ‌స్తుంది అని న‌మ్ముతాడు, ఆ స‌మ‌యంలో అలా రుషుల‌ని చంప‌ద్దు అని మండోద‌రి చెబుతుంది, కాని రావ‌ణుడు ఆమె మాట లెక్క చేయ‌డు, ఈ స‌మ‌యంలో రుషుల ర‌క్తాన్ని ఓ పాత్ర‌లో రావ‌ణుడు ఉంచుతాడు, స్నానం ఆచ‌రించ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో ఆమె అది విషం అనుకుని తాగేస్తుంది, కాని ఆమె చ‌నిపోదు ఎంతో శ‌క్తివంతంగా మారుతుంది, ఈ స‌మ‌యంలో ఆమెకు ల‌క్ష్మీ దేవి అంశగా ఓ ఆడ‌పిల్ల పుడుతుంది. అయితే ఈ ఆడ‌పిల్ల వ‌ల్ల రావ‌ణుడికి ప్రాణ‌హ‌ని ఉంది అని రాజ్య‌పండితులు చెబుతారు,అప్పుడు ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రంలో విదిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని గ్ర‌హిస్తుంది.. చివ‌ర‌కు రావ‌ణాస‌రుడు రాముని చేతిలో మ‌ర‌ణిస్తాడుఈ స‌మ‌యంలో రావ‌ణుడు సోద‌రుడు విభీష‌ణుడుకి లంక‌లో ప‌ట్టాభిషేకం చేయాలి అని రాముడు భావిస్తాడు, ఈ స‌మ‌యంలో రావ‌ణుడి భార్య‌కి చెప్పి విభిష‌ణుడ్ని వివాహం చేసుకోమండాడు కాని రావ‌ణుడిపై ప్రేమ‌ను ఆమె చంపుకోలేదు, కేవ‌లం రాజ్యం సుభిక్షం కోసం విభీష‌నుడ్ని వివాహం చేసుకుంటుంది …కొద్ది కాలం త‌ర్వాత ఆమె అర‌ణ్యాల‌కు వెళ్లి అక్క‌డే త‌ప్ప‌సు చేసుకుని ప‌ర్వతాల‌లోకి వెళ్లిపోయింది అని పురాణాలు చెబుతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation