కరోనా వైరస్ లైప్ అప్‌డేట్స్ చై నాను దాటేసిన అమెరికా.. న్యూయార్క్‌లో దారుణ పరిస్థితులు

అగ్ర‌రాజ్యం కరోనాతో అల్ల‌క‌ల్లోలంగా మారింది, అక్క‌డ ప‌రిస్దితులు చేయిదాటిపోతున్నాయి. అమెరికాలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 68,472కు చేరగా… మరణాల సంఖ్య 1032కి చేరింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 223 కరోనా మరణాలు సంభవించాయంటేనే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు రోజుల క్రితం 300 మరణాలు ఉండగా ప్రస్తుతం మృతుల సంఖ్య వేయి దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా మూడో స్థానానికి చేరింది. ఇప్పటికే ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

How Doctors Are Treating Patients With Coronavirus Disease : Goats ...

తాజాగా కరోనా వైరస్ తీవ్రత అధికంగా న్యూయార్క్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు భారీ విపత్తుగా ప్రకటించాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదముద్ర కూడా వేశారు. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఈ 30వేల మందికి పైగా వైరస్ సోకగా.. 285 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్స్‌కు సరిహద్దు రాష్ట్రాలైన న్యూజెర్సీలో 62మంది, కాలిఫోర్నియాలో 65మంది చనిపోయారు. వాషింగ్టన్‌, మిచిగాన్‌ రాష్ట్రాల్లో కూడా దీని తీవ్రత అధికంగా ఉంది. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైన వాషింగ్టన్‌లో తాజాగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశంగా అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో సుమారు 10 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

పరిస్థితులు విషమిస్తున్న నేపథ్యంలో న్యూయార్క్‌కు 24 లక్షల మాస్కులు, 1.35 కోట్ల గ్లౌజులు, 4 వేల వెంటిలేటర్లను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. వచ్చే నెల 12 కల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Content above bottom navigation