కామోపాధ్యాయుడు.. పిల్లల ముందే మహిళా టీచర్‌ కు ముద్దు పెట్టిన ఉపాధ్యాయుడు

విద్యార్థులకు చదువు చెప్పి వారిని ఒక దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు.. సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న ఉపాధ్యాయ వృత్తికి మచ్చగా మారారు కొందరు. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తున్న మన దేశంలో కొందరి అసభ్య ప్రవర్తన వల్ల తలదించుకోవాల్సి వస్తోంది. ఉపాధ్యాయులే ఇలా ఉంటే పిల్లలు ఎలా తయారవుతారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఓ ఉపాధ్యాయుడు టీచర్స్ యూనియన్ మొత్తం అసహ్యించుకునేలా చేశాడు. విద్యార్థినుల ముందే మహిళా టీచర్‌కు ముద్దు పెట్టాడు. రాజస్థాన్‌లోని కరౌలి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడి చర్యకు అక్కడే ఉన్న విద్యార్ధినులంతా పకపకా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Gujarat.

కరౌలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు ఇద్దరు మహిళా టీచర్లు కౌన్సెలింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎలా చదువుకోవాలి? చదువు తరువాత ఏం చెయ్యాలి.. ఎలాంటి ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి? అందుకోసం ఎటువంటి విధానాలు అవలంభించాలి? వృత్తిపరంగా ఎలా ఎదగాలి? అనే అంశాలపై విద్యార్థినులకు ఓ మహిళా టీచర్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అదే సమయంలో అప్పటి వరకూ క్లాస్ బైట ఉన్న ఓ ఉపాధ్యాయుడు.. కౌన్సెలింగ్‌ హాల్‌లోకి వచ్చాడు. మహిళా టీచర్ పక్కనే కూర్చున్నాడు. అలా కూర్చున్న కాసేపటికే లేచి ఆమె చెంపకు ముద్దు పెట్టాడు. అదిచూసి విద్యార్థినులంతా పకపకా నవ్వారు. సదరు ఉపాధ్యాయుడు కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు రెండు చేతులు పైకెత్తి విలాసంగా నవ్వాడు. కానీ ఉపాధ్యాయుడు హఠాత్తుగా చేసి ప్రవర్తనపై ఆ టీచర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇబ్బంది పడ్డారు. కౌన్సెలింగ్ ఇస్తున్న టీచర్ కూడా అది చూసి అదేదో చాలా సాధారణ విషయం అన్నట్టుగా నవ్వేసింది.

ఈ క్రింది వీడియోని చూడండి

టీచర్‌కు ముద్దిచ్చిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మహిళలు, బాలికలు ఎంత ఉన్నతంగా ఉండాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ వారికి ఓ లేడీ టీచర్ చెబుతుండగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ చర్యకు పాల్పడిన టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై రాజస్థాన్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రిని ప్రశ్నించినా ఆయన ఏమాత్రం స్పందించలేదు. అదో పెద్ద విషయం కాదన్నట్లుగా, ఇలాంటి వీడియోలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వరాదని ఆయన చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని చాలా సాధారణంగా చెప్పేశారు. కానీ సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని స్కూల్ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation