బ్రతికుండగానే భార్యని పూడ్చి పెట్టిన భర్త .. కారణం తెలిస్తే బిత్తరపోతారు

120

నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం గొట్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భర్తే భార్యను కొట్టి సజీవంగా భూమిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల తర్వాత మృతురాలి ఏడు సంవత్సరాల పాప గ్రామస్తులకు చెప్పడంతో హత్య విషయం బయటపడింది.

గ్రామంలో నివాసముంటున్న పొన్నూరు సుభాషిణి, ఆమె భర్త సాములు కలిసి మద్యం సేవించారు. ఆ తరువాత గొడవపడ్డారు. ఈ గొడవలో సాములు కర్రతో సుభాషిణిని బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయి పడిపోయింది. అయితే సుభాషిణిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పక్కనే చెట్ల పొదళ్లో గుంత తీసి సజీవంగా పూడ్చిపెట్టాడు. కుమార్తెను బెదిరించి పారిపోయాడు. మృతురాలి కుమార్తె రెండు రోజుల తర్వాత బంధువులకు, గ్రామస్తులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొడవలూరు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.

Content above bottom navigation