సొంత చెల్లిని పెళ్లి చేసుకున్న సిక్కు యువకుడు.. కారణం తెలిస్తే షాకే

అసలు స‌మాజంలో ఇలాంటి దారుణ‌మైన సంఘ‌ట‌న ఎక్క‌డా జ‌ర‌గ‌దు .. ఎంత దారుణ‌మైన ఘ‌ట‌న అంటే ఇది వింటే ఎవ‌రైనా విమ‌ర్శించ‌క మానరు, అమ్మ‌ని ఎలా చూస్తామో అక్క‌ని చెల్లిని అలాగే చూస్తాము.. కాని ఇక్క‌డ మ‌రీ దారుణంగా సొంత చెల్లినే భార్య‌ని చేసుకుని నాట‌కం ఆడాడు ఓ యువ‌కుడు. వీరిద్ద‌రి క‌న్నీంగ్ ఆలోచ‌న‌కు అధికారులు త‌ల్లిదండ్రులు షాక్ అయ్యారు..

విదేశాల్లో ఉద్యోగం చేయాలనో, నివసించాలనో చాలామందికి ఉంటుంది. అందుకు ఒక్కోసారి అడ్డదారులు కూడా తొక్కి ఇబ్బందుల్లో పడుతుంటారు. ఇలాగే పంజాబ్‌కు చెందిన యువకుడు తన చెల్లిని ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు పెళ్లి నాటకమాడి చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్‌లోని బటిండా జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన మన్‌ప్రీత్ సింగ్ అనే యువకుడు 2012 నుంచి ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి చెల్లి అమన్‌దీప్ కౌర్‌కు కూడా ఆస్ట్రేలియాలో ఉండాలని కోరిక. కానీ ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించినా వీసా రాలేదు. దీంతో అన్నకు చెప్పి బాధపడేది. చెల్లి ఆవేదనను అర్థం చేసుకున్న మన్‌ప్రీత్ ఓ కన్నింగ్ ప్లాన్‌ వేశాడు. తన చెల్లెలి పేరు రణవీర్ కౌర్‌గా మార్చేసి ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తన భార్యను ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు పాస్‌పోర్ట్, వీసాకు అప్లయ్ చేశాడు. వీటిని పరిశీలించిన అధికారులు ఆమెకు వీసా మంజూరు చేయడంతో ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.

ఇటీవల అధికారుల తనిఖీల్లో అసలు విషయం బయటపడింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అమన్‌దీప్ కౌర్, మన్‌ప్రీత్ సింగ్ సొంత అన్నాచెల్లెళ్లని, ఆస్ట్రేలియా వెళ్లేందుకు దొంగ పెళ్లి చేసుకున్నారని తెలుసుకున్నారు. దీంతో అన్నాచెల్లెళ్లతో పాటు వారికి సహకరించిన వారిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు త‌ర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. చూశారుగా వీరు చేసిన దారుణం .. అయితే ఈ విష‌యం వారి ఇంట్లో త‌ల్లిదండ్రుల‌కి తెలియ‌ద‌ట‌, భార్య భ‌ర్త‌లుగా మారి ఇలా ఆస్ట్రేలియా జంప్ అయ్యారు, ఇప్పుడు అక్క‌డ నుంచి ఇక్క‌డ‌కు రానున్నారు.. మ‌రి కోరిక‌ల కోసం ఇలాంటి అడ్డ‌దారులు తొక్క‌డం ఎంత త‌ప్పో ఓసారి మ‌న‌సాక్షిని ప్ర‌శ్నించుకోవాలి…. ఇక బంధాలకి విలువ‌లు ఎక్క‌డ ఉంటాయి.. ఇలాంటి దారుణ‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగితే.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation