breakingnews : కెప్టెన్ గా కోహ్లీ రాజీనామా ?

125

విరాట్ కోహ్లి. ఇండియ‌న్ క్రికెట్ ప్రేమికులకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా కూడా విరాట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలుసు. క్రికెట్ లో అవతలి టీమ్ లో ఎవరున్నా సరే, సెంచరీలు కొట్టే ఈ బ్యాట్స్ మన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీమ్ ఇండియాకు మూడు ఫార్మాట్ లో కెప్టెన్ గా ఉంటూ టీమ్ ఇండియాను నెంబర్ 1 స్థానంలో ఉంచాడు. అయితే కోహ్లీ ఇప్పుడు తన కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

హన్సిక హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ

విరాట్ కోహ్లీ తన కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. టీమిండియా బిజీ షెడ్యూల్‌పై ఇటీవల పెదవి విరిచిన కోహ్లీ 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రెండు ఫార్మాట్లలో మాత్రమే క్రికెట్ ఆడతానని ప్రకటించాడు. ‘‘విరాట్ కోహ్లీ 2021లో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత ఏదైనా ఒక ఫార్మాట్‌లో తప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా..?’’ అని మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు.

దానికి విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ ‘2023 వరకూ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత ఒకసారి పునరాలోచించుకుంటాను. ఎందుకంటే.. గత ఎనిమిదేళ్లుగా ఏడాదిలో కనీసం 300 రోజులు క్రికెట్‌ కోసం కేటాయిస్తున్నాను. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మేము కూడా వ్యక్తిగతంగా కొంచెం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాం. కానీ మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకి అది సాధ్యం కావడం లేదు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

మరోవైపు టీమ్ నా నుంచి గెలిపించే ప్రదర్శన ఆశిస్తోంది. కాబట్టి మరో మూడేళ్ల వరకూ మూడు ఫార్మాట్లలో ఆడతాను. ఆ తర్వాత ఒక ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తా’ అని వెల్లడించాడు. ఇలా కోహ్లీ చేసిన కామెంట్స్ ను బట్టి చుస్తే 2023 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ టి20 క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు అని అర్థం అవుతుంది.

Image result for kohli

అలాగే గత కొన్ని రోజులుగా కోహ్లీ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతను మూడు ఫార్మాట్ల భారం మోస్తూ అతని ఆటను ఇబ్బంది పెట్టుకుంటున్నాడు అంటూ పలువురు క్రీడా పండితులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలసిపోయి ఆడాల్సిన అవసరం లేదని మండిపడుతున్నారు. మూడు ఫార్మాట్లకు ఆడటం, దానికి తోడు కెప్టెన్ గా పని చేయడంతో కోహ్లీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడని, దీనితో జట్టు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. కోహ్లీ ఆడితే మరో ప్రపంచకప్ ఆడతాడు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ ఆలియా భట్

వచ్చే ప్రపంచకప్ వరకు అతను కెప్టెన్ గా ఉంటాడో ఉండడో చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఒత్తిడి తగ్గించుకుంటే, అప్పుడు అతను కొనసాగే అవకాశం ఉంటుంది అని, ఒత్తిడి తగ్గించుకుని టి20 బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా అతను రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బోర్డ్ పెద్దలు కూడా కోహ్లీ కి ఇదే విషయం చెప్పారని అంటున్నారు. త్వరలోనే అతను దీనిపై నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయని, ఐపిఎల్ జరుగుతున్న సమయంలోనే ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ టీ20ల్లో మాత్రం ఈ భారత కెప్టెన్ ఇటీవల పదో స్థానానికి పడిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ వన్డే, టెస్టుల్లో కొనసాగుతూ.. టీ20లకి మాత్రం రిటైర్మెంట్ ఇచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కోహ్లీ టి20 లను వదిలేస్తే కోహ్లీ లాగా టీమ్ ను నడిపించే కొత్త కెప్టెన్ కోసం భారత్ అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే భవిష్యత్ లో కెప్టెన్ అయ్యే లక్షణాలు ఏ ఒక్కరిలో కూడా లేవు. ఇప్పుడిప్పుడే క్రికెట్ లోకి వస్తున్నా వారిలో ఒక కొత్త కెప్టెన్ ను తయారుచెయ్యాల్సిన అవసరం ఉంది.

బ్రేకింగ్ న్యూస్ : ఏపీలో ఇద్దరు మంత్రులు రాజీనామా…?

అమ్మాయి వ్యవహారం.. టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్…!

Content above bottom navigation