గోడ నుంచి కారుతున్న రక్తం .. ఏమైందో తెలిస్తే షాక్

84

గోడకు మేకు కొడితే ఏమవుతుంది? అదేం ప్రశ్న అంటారా? కొన్ని ప్రశ్నలు అలాగే ఉంటాయి. హ ఏమవుతుంది లోపలికి దిగుతుంది అని అంటారా.. అయితే ఒకచోట గోడకు మేకు కొడితే రక్తం వస్తుంది. రక్తం వస్తుంది కదా అని ఆ గోడను బద్దలకొట్టి చూస్తే అందులో శవం ఉంది. ఇలాంటి సీన్స్ మీరు హర్రర్ సినిమాల్లో చాలానే చూసి ఉంటారు. నిజ జీవితంలో ఎప్పుడు చూసింది గానీ, విని గానీ ఉండరు. అయితే ఇక్కడ మేకూ కొట్టలేదు, గోడ బద్దల కొట్టలేదు. కానీ గోడ నుంచి నల్లగా కారుతున్న ఆ ధార ఏమిటో చూద్దామని పై ఫ్లాట్‌కు వెళ్లారంతే!

అమెరికాలో మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్ నగరంలో నివసిస్తున్నా ఏజే ‌మెక్‌క్రాడీ అనే యువకుడు తన స్నేహితుడి ఎవైన్ షుల్ట్జ్ కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల అతడి ఫ్లాట్‌లో ఓ గోడ నుంచి నల్లని ద్రవం ఏదో కారుతున్నట్లు కనిపించింది. బాగా దుర్వాసన వెదజల్లుతున్న ఆ ద్రవం ఏమిటనేది వారికి అర్థం కాలేదు. దాన్ని పరిశీలనగా చూడగా అది, గోడ నుంచి కాదని, సీలింగ్‌ కు గోడకు మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ నుంచి వస్తుందని తెలుసుకున్నారు. ముందు లీకవ్వతున్న తమ బాత్రూమ్ వల్ల అది ఏర్పడి ఉండవచ్చని వారు భావించారు. దీంతో మెయిటెనెన్స్ వర్కర్లను పిలిచారు. బాత్రూమ్‌ లో మరమ్మతులు చేసిన తర్వాత ఆ ద్రవాన్ని పరిశీలించారు. దాన్ని తుడిచేందుకు ప్రయత్నించగా నల్లగా ఉన్న ఆ ద్రవం ముదురు ఎర్ర రంగులో కనిపించింది. ఆ లీకేజీ తమ ఇంట్లోనే వస్తుందా? లేదా పై ఇంట్లో ఏదైనా ద్రవం కిందపడి లీకవుతుందా? అని తెలుసుకొనే ప్రయత్నం చేశారు. తమ ఇంట్లో ఏర్పడిన లీకేజీ వాళ్ల ఇంట్లో కూడా ఉందా, లేదా అని తెలుసుకోవడానికి ఏజే పై ఫ్లాట్‌లోకి వెళ్లాడు. అందులో ఉంటున్న వ్యక్తిని పిలిచాడు. ఎలాంటి స్పందన రాలేదు.

తలుపు లోపల నుంచి గడియ పెట్టి లేకపోవడంతో ఏజీ, అతని మిత్రుడు లోపలికి వెళ్లారు. తలుపు తీయగానే ముక్కు పగిలిపోయేంత వాసన వచ్చింది. దీంతో అతడి గుండె దడ పెరిగిపోయింది. ఇంట్లో ఎవరూ లేరని భావించారు. బెడ్రూమ్‌లోకి వెళ్లి చూసి షాకయ్యారు. ఆ ఫ్లాట్ బెడ్రూమ్‌ లో శవం కనిపించింది. దీంతో వెంటనే ఏజే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడు సుమారు వారం రోజుల కిందట చనిపోయాడని, అతడి నుంచి రక్తం సీలింగ్, గోడ మధ్య ఉండే ఖాళీ నుంచి లీకైందని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి నిద్రలోనే చనిపోయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. అయితే ఆ రక్తం ఎలా కారింది, ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. పోలీసులు దీన్ని సాధారణ మరణంగానే కేసు నమోదు చేసుకున్నా, అతడి బంధువులు, స్నేహితులను విచారించి అసలు కారణం తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతా జరిగినా ఏజే, అతడి స్నేహితుడు ఇంకా ఆ ఫ్లాట్‌ లోనే ధైర్యంగా నివసిస్తున్నారు. ఈ విషయాన్ని ఏజే ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడంతో వైరల్‌ అయ్యింది.

Content above bottom navigation