ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. భారీ వర్షాలు, పిడుగులు

111

ఉత్తరాంధ్రలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. IMD బులెటిన్ ప్రకారం.. తూర్పు మధ్య బంగాళాఖాతం లో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో పిడుగుల పడే అవకాశముందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని చెప్పారు.

Israel rain view to street through rain-specked window

పిడుగుల పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, చెరువు, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేశారు. జూన్ 9న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని.. కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.

జూన్ 10న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం అవకాశం ఉందని. తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి అంచనా వేస్తున్నారు. దీనితో పాటు రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఇక జూన్ 11, 12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. రాయలసీమలో పిడుగులు పడవచ్చని విపత్తుల శాఖ తెలిపింది.

Content above bottom navigation