భారత్ కు పొంచి ఉన్న తీవ్ర తుఫాను ముంచుకొస్తున్న పెను ప్రమాదం..

భార‌త్‌కు మ‌రోముప్పు పొంచిఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అది బంగాళాఖాతం మీదుగా భార‌త్‌లోని కోస్తా తీరాల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంద‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. తీవ్ర తుఫాను దేశం మీద‌కు దూసుకొస్తోంద‌ని చెప్పారు.

పూర్తి వివరాలకు వీడియో చూడండి:

దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 27న అల్పపీడనం ఏర్పడి, బలపడుతుందని తెలిపారు.

దీని ప్రభావంతో దేశంలోని తీర ప్రాంతమంతా అల్లకల్లోలం కానుంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

అండమాన్ నికోబర్ దీవుల్లో ఏర్పడే ఈ తుపాను నెమ్మదిగా పెరిగి కోస్తా ప్రాంతాలను అతలాకుతలం చేస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ తుఫాను ప్రభావంతో రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ తుపాను ప్రభావం అనంత‌రం మరో తుపాను మే 1న ఉత్తర అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

దాని ప్రభావంతో తీర ప్రాంతాల‌ను వాన‌లు, వ‌డ‌గాలులు వ‌ణికిస్తాయ‌ని పేర్కొన్నారు. తుపాను ప్రభావాన్ని తట్టుకొనేందుకు అప్రమత్తం కావాలని అధికారుల్ని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

Content above bottom navigation