విమానంలో మహిళ ప్రసవం. అధికారులు చేసిన పని తెలిస్తే శబాష్ అంటారు..

గర్భిణీ ప్రసవ సమయంలో విమానాన్ని అర్జెంటుగా ల్యాండ్ చేసిన సందర్భాలు చూశాం కానీ, విమానంలోనే ప్రసవించడం చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక మహిళ గాల్లోనే ప్రసవించింది. విమానంలో ప్రసవించడంతో అత్యవసర ల్యాండింగ్ చేసారు. సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు డేట్ దగ్గరకు వస్తుంటే విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటారు. అసలు ప్రయాణాలకే దూరంగా ఉండటమే కాకుండా ఇంటి పట్టున ఉంటారు. అయితే అనుకోకుండా ఒక మహిళ ప్రయాణంలోనే ప్రసవించింది. అయితే ఇక్కడ అధికారులు చూపిన చొరవ అందరి చేత శబాష అనిపించింది.

Image result for విమానంలో మహిళ ప్రసవం.

థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ మంగళవారం విమానం ప్రయాణిస్తుండగానే ఓ పాపకు జన్మనిచ్చింది. దోహా నుంచి బ్యాంకాక్ వెళ్తున్న విమానంలో ఉన్న మహిళకు సడెన్ గా పురిటినొప్పులు వచ్చాయి. సమయానికి విమానంలో ఎవరు కూడా డాక్టర్ లేడు. దాంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పైలెట్ పిలుపిచ్చాడు. అయితే అదే సమయంలో రన్ వే పైన మరొక ఫ్లైట్ ఉంది. అక్కడ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడం కష్టం. అయినా కూడా పురిటినొప్పులు కాబట్టి అధికారులు తగు చర్యలు తీసుకుని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. ల్యాండింగ్ సమయంలో రన్ వే పైన ఉన్న విమానాన్ని మరొక చోటికి తరలించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. అయితే అప్పటికే విమానంలో ఉన్న గర్భిణీ ప్రసవించింది. ఖతర్ ఎయిర్‌వేస్‌కు చెందిన సిబ్బంది సాయంతో తెల్లవారుజాము 3గంటల సమయంలో ప్రసవించింది. ఆ తర్వాత కోల్‌కతాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఎయిర్‌పోర్టులోని వైద్యులు ఆ మహిళకు విమానంలో ఆమె కూర్చున్న సీటుపైనే పురుడు పోశారు. శిశువు పెద్దపేగు కోయడానికి అవసరమయ్యే బ్లేడ్లు విమానంలోకి తీసుకువెళ్లడానికి సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆమెతో పాటు శిశువును నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. తల్లి.. పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

‘కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అధికారులు మాట్లాడుతూ.. దోహా నుంచి బ్యాంకాక్ వెళ్లే QR-830 విమానం తెల్లవారు జాము 3గంటల 9నిమిషాల సమయంలో ఆగింది. ఖతర్ విమానం అత్యవసర సహాయం కావాలని అడగడంతో ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు అనుమతిచ్చాం. విమానం సేఫ్ గా ల్యాండ్ అవడంతో పాటు ఎయిర్‌పోర్టు మెడికల్ డాక్టర్ అత్యవసర సహాయం అందించారని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. తల్లీబిడ్డను శనివారం వారి స్వదేశం పంపించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇంగ్లీషు మీడియా ఈ వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అద్బుతమైన స్పందన వస్తుంది. సిబ్బందిని పొగుడుతూ, బేబీకి పేర్లు సూచిస్తున్నారు. ‘ఇండియా అని పేరు పెట్టండి’, ‘కంగ్రాచ్యులేషన్స్’, ‘గుడ్ జాబ్’, ‘వెల్‌కమ్ టు ద వరల్డ్ బేబీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ న్యూస్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. గతేడాది జులైలోనూ ఓ మహిళ ఇలాంటి ప్రసవమే అయింది. దోహా నుంచి బీరట్ వెళ్తుండగా గాల్లోనే ప్రసవం జరిగి పాప పుట్టింది. అలాగే డిసెంబర్ లో కూడా ఫ్లోరిడాకు చెందిన మహిళ జెట్‌వే విమానంలో ప్రసవించిందిఈ క్రింది వీడియోని చూడండి .

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation