ఆర్జీవీ ఇచ్చిన 5 లక్షల రూపాయలను రేణుక ఏం చేసిందో తెలుసా?

రెండు నెలల కింద హైదరాబాద్‌లో జరిగిన అతి నీచమైన ఘటన దిశ రేప్ అండ్ మర్డర్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎపిసోడ్‌లో పది రోజులకే నిందితులను కాల్చి చంపేసారు పోలీసులు. ఇందులో మలుపులు లేవు.. ట్విస్టులు లేవు.. రేప్ చేసిన ఒక్క రోజులోనే నిందుతులను పట్టుకున్నారు ఖాకీలు. ఆ తర్వాత విచారణ పూర్తి చేసి.. సీన్ రీ కన్సస్ట్రక్షన్ చేస్తుండగా పారిపోయారని కాల్చి పడేసారు. అయితే దిశ ఎపిసోడ్ అయిన దగ్గర్నుంచి కూడా దీనిపై సినిమా ఎవరో ఒకరు తీస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. చివరికి అదిప్పుడు వర్మ చేతుల్లోనే పడింది. కొందరు వద్దని వారిస్తున్నా, ఆర్జీవీ మాత్రం పట్టించుకునేలా కనిపించడం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి ఫిక్సైపోయాడు. అందుకే దిశ నిందుతుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను ఈ మధ్యనే కలిసాడు వర్మ. ఆమెతో దిశ ఘటనకు ముందు ఏం జరిగింది.. చెన్నకేశవులు ఎలాంటి వాడు.. ఊళ్లో ఎలా ఉండేవాడు ఇలా చాలా విషయాల గురించి ఆరా తీసినట్లు తెలుస్తుంది.

Image result for ఆర్జీవీ

అలాగే రేణుకను ఆర్జీవీ ఆర్థికసాయం చేసిన సంగతి తెలిసిందే. బ్లాంక్ చెక్కును ఆమెకు ఇచ్చాడు. ఆమెను కలిసిన తర్వాత వర్మ ట్వీట్ చేశాడు. 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు.. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది.. దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడంటూ పోస్ట్ చేసాడు వర్మ. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనివ్వబోతుందిప్పుడు. వాళ్లిద్దరికీ ఇప్పుడు మంచి భవిష్యత్తు లేదని తెలిపాడు వర్మ.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఆర్జీవీ ఇచ్చిన బ్లాంక్ చెక్కుతో చెన్నకేశవులు భార్య రేణుక 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఆర్జీవీ చెక్ ఇచ్చిన మరుసటి రోజే ఆ డబ్బును డ్రా చేసింది రేణుక. 5 లక్షల రూపాయలు తీసుకున్న రేణుక అందులో ఆమె మామ కోసం దాదాపు లక్ష ఖర్చు చేసినట్టు సమాచారం. ఆమె మామ కురుమయ్యకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అయన ఇంకా ఆ ప్రమాద ఘటన నుంచి కోలుకోలేదు. ఇంకా కొన్ని గాయాలు ఉన్నాయి. చికిత్స కోసం ఆ కుటుంబం దగ్గర డబ్బులు లేక సరిగ్గా చూపించలేదు. ఇప్పుడు డబ్బులు రావడంతో రేణుక కురుమయ్యకు చికిత్స చేయించిందంట. అలాగే మిగతా డబ్బులో లక్ష రూపాయలు ఇంటి, పొలం పనులకు తీసుకుందట. మిగతా డబ్బును తనకు పుట్టబోయే బిడ్డ పేరు మీద డిపాజిట్ చేసిందంట. ఇలా ఆర్జీవీ చేసిన ఆర్థిక సహాయాన్ని చక్కగా వినియోగించింది. దిశా విషాదాంతం నుంచి రేణుక ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆ కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Content above bottom navigation