లాక్ డౌన్ అయ్యాక జరగబోయేది ఇదే

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటే ఇదేనని. పదేళ్ల ప్రాయంలోనే భగవద్గీతలోని 700 శ్లోకాలను అనర్గళంగా వల్లెవేయడం, జ్యోతిషం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం చెప్పడం మామూలు విషయం కాదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.అతనిది మైసూర్. తండ్రి పేరు ఆనంద్ రామసుబ్రమణియన్, తల్లి అన్నుఆనంద్. అతి చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రాన్ని అవుపోసన పట్టడం అభిగ్య ఆనంద్ ప్రత్యేకత. ఇప్పుడతని వయసు 14 ఏళ్లు. గుజరాత్ లోని మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేదవిశ్వవిద్యాలయం ఆచార్యుడిగా ఇంత చిన్నవయసులో నియమితుడవడం మామూలు విషయం కాదు. అతని సోదరి అభిదేయకు కూడా ఇలాంటి ప్రతిభాపాటవాలు ఉన్నాయి. అతి చిన్న వయసులో గ్లోబల్ చైల్ పాడిజీ అవార్డును అందుకున్నాడు. ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ చేశాడు.

coronavirus :14 yr old boy predicts corona viral video | klapboardpost
సొగసులతో చిత్తు చేస్తున్నమీరా చోప్రా.

గ్రహస్థితిగతులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని అతను ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని చెప్పాడు. దీనిపై 7 నెలల క్రితమే అతను చేసిన వీడియో కూడా చేశాడు. వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని కూడా అతను ప్రకటించాడు. ఇక తాజాగా మ‌రిన్ని విష‌యాలు చెప్పాడు.

అందమా అద్బుత రూపమా అన్నట్లు ఉన్న నిధి అగర్వాల్..

ఈ వ్యాధి ముప్పు మే నెల ఆఖ‌రి వ‌ర‌కూ ఉంటుంది అని చెప్పాడు.. జూన్ మొద‌టి వారం నుంచి త‌గ్గుతుంది అని, మే నెల చివ‌ర‌కు ఆహ‌ర కొర‌త వ‌స్తుంది అన్నాడు, అలాగే ఆర్దిక వ్య‌వ‌స్ధ చితికిపోతుంది
అని అన్నాడు, ఏప్రిల్ 14 త‌ర్వాత వ్యాధి త‌గ్గే సూచ‌న‌లు లేవు అన్నాడు. ఎవ‌రూ ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావ‌ద్దు అని తెలిపాడు. జూన్ ఆఖ‌రికి వ్యాధి పూర్తిగా త‌గ్గుతుంది అని తెలిపాడు…దైవ‌చింత‌న మంచిది అని చెప్పాడు.. దిల్లీ మ‌హ‌రాష్ట్ర‌ తెలంగాణ ఆంధ్రాలో కేసులు అధికం అవుతాయి అన్నాడు ఈ బాల బ్ర‌హ్మం.

Content above bottom navigation