లాక్ డౌన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు

153

కోవిడ్ -19 రెండో స్టేజ్ పై అప్రమత్తంగా ఉన్న భారత్ జనతా కర్ఫ్యూలు లాక్ డౌన్లతో జనసంచారాన్ని నియంత్రించే చర్యలు చేపట్టింది. వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఇదే మేలైన మార్గమని భావిస్తున్నారు. అయితే తాజాగా లాక్ డౌన్లపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) బాంబు పేల్చింది. లాక్ డౌన్ వల్ల అంతలా యూజ్ ఉండదని తెలిపింది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Image result for లాక్ డౌన్స్

కోవిడ్ -19 విజృంభిస్తున్న నేపథ్యంలో భారత దేశం మొత్తం లాక్ డౌన్ దిశగా పయనిస్తుంది. ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈనెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ చేస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాయి. మన రాష్ట్రాలే కాదు దేశాలకు దేశాలే లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలు ఇంటి నుంచి కదలకుండా కాలు బయట పెట్టకుండా, బయట ఉన్న వైరస్ బయటనే నశించే విధంగా కీలక చర్యలు చేపడుతున్నాయి. అయితే చాలా దేశాలు, రాష్ట్రాలు వైరస్ తీవ్రతను తగ్గించేందుకు లాక్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కేవలం లాక్ డౌన్ చేసినంత మాత్రాన కోవిడ్ -19 వైరస్ ప్రభావం తగ్గదని షాకింగ్ న్యూస్ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాక్ డౌన్‌ లో మనం ఉన్నంత మాత్రాన ప్రాణాంతకమైన ఆ మహమ్మారిని ఓడించలేమంటున్నారు WHO హై రిస్క్ నిపుణుడు మైక్ ర్యాన్.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యం పరంగా బలమైన చర్యలు చేపట్టకుండా, కేవలం లాక్ డౌన్ లు ప్రకటించడం అత్యంత ప్రమాదమని స్పష్టం చేసింది. లాక్ డౌన్ ప్రకటించినన్ని రోజులు వైరస్ కాస్త కంట్రోల్లోనే ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ ఎత్తి వేయగానే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఎత్తివేసి ఎవరైతే వైరస్ బారిన పడ్డారో, అనారోగ్యానికి గురయ్యారో, వారిని గుర్తించి ఐసోలేషన్ చేయడం, వారికి త్వరగా చికిత్స చేస్తే తప్ప ఈ వ్యాధి నయం కాదని మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. ప్రతీ అనుమానితుడిని గుర్తించి చైనా సింగపూర్ దక్షిణకొరియా ప్రభుత్వాలు వైద్యం అందిస్తూ నివారిస్తున్నాయని, యూరప్ భారత్ వీటిని ఫాలో అవ్వాలి. వైరస్ నియంత్రణ అంత ఈజీ కాదని.. పోరాటాన్ని కొనసాగించాలని మైక్ ర్యాన్ తెలిపారు. దీంతో ఇప్పుడు లాక్ డౌన్ చేసిన రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వాలు, వైరస్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Content above bottom navigation