ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ రష్యా, ఉత్తర కొరియాల్లో ఎందుకు వ్యాపించలేదు? కరోనాకు కేంద్రమైన చైనాలోని వూహాన్ మినహా.. ఇతర నగరాల్లో ఆ వైరస్ ఎందుకు లేదు? ఇతర దేశాల్లో తన ప్రతాపాన్ని చూపుతూ.. ఆర్థిక వ్యవస్థ, స్టాక్‌మార్కెట్లను కరోనా అతలాకుతలం చేస్తున్నా.. వూహాన్లో మాత్రం రికవరీలు అంతవేగంగా ఎలా సాధ్యమయ్యాయి? దీనికి విశ్లేషకులు చెబుతున్న సమాధానం ఒక్కటే..! కరోనా వైరస్ చైనా సృష్టే. అంతకంటే ముందే ఆ దేశం వైర్‌సకు విరుగుడు(యాంటీ డోట్)ను కనుగొంది. తనకు బలమైన మిత్ర దేశాలు రష్యా, ఉత్తర కొరియాలకు ముందే యాంటీడోట్ అందజేసింది. అందుకే.. ఆ రెండు దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదు. ఆర్థికంగా బలమైన దేశంగా ఎదగాలనుకునే చైనాకు ముందున్న పెద్ద ప్రత్యర్థి అమెరికానే.అమెరికాను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే.. వైర్‌సతో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఈ డ్రాగన్ వికృత ఆటలో.. ఇతర దేశాలు బలయ్యాయి. ముందుగానే విరుగుడు మందు ఉన్నందునే..

కరోనా వైరస్ పేరుతో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా? వారి యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు వైరస్ బూచిని వాడుకుందా? ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇప్పుడు తెరమీదకి రావడం తీవ్ర చర్చానీయాంశమయ్యింది. అయితే చైనాలోని ప్రతిష్టాత్మక కంపెనీలలో తమకున్న అత్యంత విలువైన షేర్లను అతి తక్కువ ధరలకే ఆ దేశ ప్రభుత్వానికే అమ్ముకోవాల్సి రావడంపై అమెరికా, యూరప్‌కు చెందిన వ్యాపార వేత్తలు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు చైనా పక్కా వ్యూహం రచించిందన్న అనుమానాలు బలమయ్యాయి.అయితే చైనాలో బలంగా పాతుకుపోయిన యూరప్, అమెరికాకు చెందిన పెట్టుబడిదారులను తరిమేయడానికి చైనా ఈ పన్నాగం పన్నినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం లేకుండానే వారిని తమ దేశం నుంచి సాగనంపేందుకు చైనా ఈ వ్యూహాన్ని అమలు చేసిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చైనాలోని ప్రముఖ రసాయన, సాంకేతిక పరిశ్రమలలో యూరప్, అమెరికాకు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థల పెట్టుబడులే ఇందులో అధికంగా ఉండేవి. అయితే దాదాపు అందులో సగం లాభాలను ఆయా దేశాల వారే తీసుకోవడం చైనాకు నచ్చడం లేదట. ఆ ప్రభావం చైనా కరెన్సీ యాన్పై పడడంతో నిత్యం ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వస్తుందని, తమ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలు శాసించడం చైనాకు నచ్చకపోవడంతో ఇప్పుడు కరోనాను అస్త్రంగా వాడుకున్నట్టుగా భావిస్తున్నారు.

అయితే దేశం మొత్తం కాకుండా వ్యుహాన్ వరకే కరోనా పరిమితమయ్యేలా చూసుకుంది. కరోనా వైరస్‌ను అధిగమించేందుకు కనీసం మాస్కులు కొనే ఆర్థిక పరిస్థితులు కూడా తన దేశానికి లేదని రూమర్స్‌ను స్ప్రెడ్ చేసుకుంది. కరోనా నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడం కష్టమేనంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యల ఆ దేశంలో పారిశ్రామిక రంగంపై అనుమానాలు పెంచాయి. దీనితో విదేశీ పెట్టుబడిదారులు తక్కువ ధరలకే తమ వాటాలను అమ్ముకున్నారు.ఇదంతా పక్కాగా జరగడంతో కేవలం రెండే రెండు రోజుల్లో చైనా 20 బిలియన్ డాలర్ల సంపదను సొంతం చేసుకుంది. ఇందులో ఏ మాత్రం అనుమానం రాకుండా చాలా పకడ్బందీగా చైనా తన ప్లాన్‌ను అమలు చేసుకుందనే చెప్పాలి. దీనిని అర్ధం చేసుకునే సరికి అమెరికా, యూరప్ పెట్టుబడిదారుల షేర్లన్నీ చైనా ప్రభుత్వం చేతిలోకి మారొపోయాయి. కరోనా వైరస్ నిజంగానే చైనాను ముప్పు తిప్పులు పెట్టింది. కానీ ప్రపంచం ఊహించినంత రేంజ్లో మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా సంబంధించిన యాంటీ వైరస్‌ను చైనా ఇప్పటికే తయారు చేసుకుని ఉంచుకుందని అంటున్నారు. వరల్డ్‌లో మీటర్ గణాంకాలు కూడా చైనాపై అనుమానులు రేకెత్తించేలా ఉన్నాయి. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటి వరకు మొత్తం 81,054 కరోనా కేసులు నమోదైతే అందులో 72,440 కేసులు రికవరీ అయ్యాయి.
అయితే ఇటలీలో మొత్తం 53,578 కేసులు నమోదు అయితే, అందులో కేవలం 6,072 మంది మాత్రమే రికవరీ అయ్యారు. ఇక మిగతా దేశాల గణాంకాలు కూడా ఇలానే ఉన్నాయి. అయితే వైరస్ పుట్టి, అత్యధిక కేసులు నమోదు అయిన చైనాలో ఎక్కువ మంది వ్యాధి నుంచి కోలుకోవడం చూస్తే ఆ దేశం కరోనా వైరస్‌కు సంబంధించిన యాంటీ వైరస్‌ను తయారు చేసుకుందేమోనన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో మెదలుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇప్పట్లో తేలడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది.