అమెరికా లాక్ డౌన్ ఎందుకు ప్రకటించాలేదో తెలుసా

ప్రపంచవ్యాప్తంగా మరో నెల రోజుల పాటు వైర‌స్ తీవ్రత కొనసాగే అవకాశం ఉంది అని చెబుతున్నారు వైద్యులు.న్యూయార్క్‌లో వైర‌స్ తీవ్రత పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వం నేరుగా లాక్‌డౌన్‌ ప్రకటించనప్పటికీ.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నిలిచిపోయింది. అలబామాతో పాటు చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. పరీక్షల్లో జాప్యం, వైద్యపరికరాల కొరత వంటి కారణాలతో అమెరికాలో దీని తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. కట్టడి చేయలేకపోవడానికి ఇది కూడా కొంత కారణమనే ఆందోళన వ్యక్తమౌతోంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న మౌని రాయ్

What could happen as the coronavirus spreads across America ...

నిన్న, మొన్నటి వరకు చాలా రాష్ట్రాల్లో అమెరికా వైద్యులకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు అందుబాటులో లేవు. దీంతో వైద్యులు పాలిథిన్‌ ట్రాష్‌ బ్యాగులను రక్షణ దుస్తులుగా ధరించిన సందర్భాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్కుల కొరత కారణంగా ఒకే మాస్కును నాలుగైదు రోజులు వాడాల్సిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. న్యూయార్క్‌ వంటి రాష్ట్రాల్లో వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు తెలుసుకునేందుకు ఒకటి, రెండు రోజులు పడుతోంది.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

భారతదేశంలో లాక్‌డౌన్‌ విధించి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. వైద్యసౌకర్యాలు నామమాత్రంగానే ఉన్న భారత్‌లో వైర‌స్ విజృంభిస్తే నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అమెరికా పరిస్థితి వేరు. లక్షలాది పర్యాటకులు అమెరికాను సందర్శించే సీజన్‌ ఇది. పైగా ఇక్కడ ఉద్యోగులు జీతంగా ఆర్జించే మొత్తాన్ని పైసా కూడా మిగుల్చుకోకుండా ఖర్చు చేసుకోవడానికి అలవాటుపడ్డారు. జీతాలు రాకపోతే అలజడి ఏర్పడి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రభుత్వం భావించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అమెరికా లాక్‌డౌన్‌ ప్రకటించలేకపోయింది. అదే అమెరికాకు, ప్రధానంగా న్యూయార్క్‌ వంటి నగరాలకు సమస్యగా మారింది.అమెరికాతో పాటు పలు దేశాల్లో వైర‌స్ ప్రస్తుతం పతాకస్థాయికి చేరింది. ఈ స్థితి నుంచి ఒక్క కేసు కూడా లేని స్థితికి రావడానికి కనీసం నెల రోజుల వ్యవధి అయినా పడుతుంది. భారత్‌ వంటి దేశాల్లో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మే చివరికల్లా తీవ్రత పెరిగే ప్రమాదముంది. సామాజిక దూరం పాటించడం, వీలైనంత మేరకు పరిశుభ్రత పాటించడం మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం. అని చెబుతున్నారు వైద్యులు.

Content above bottom navigation