ఇంట్లో మొగుడు… టిక్ టాక్ లో ప్రియుడు.. నిజం తెలిసిన భర్త ఏంచేశాడంటే…

137

ప్రముఖ మొబైల్ యాప్ టిక్ టాక్ వచ్చిన తర్వాత చాలా మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. కొందరికి ఈ యాప్ మంచికి ఉపయోగపడితే.. కొందరి జీవితాలను తారుమారు చేస్తోంది. ఓ వివాహిత… ఈ యాప్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి.. భర్త, పిల్లను పట్టించుుకోవడం మానేసింది. అక్కడితో ఆగితే బాగానే ఉండేది.. అందులో ఓ ప్రియుడిని కూడా సెట్ చేసుకుంది.అందులో ఓ యువకుడితో పరిచయం పెంచుకొని.. దానిని వివాహేతర సంబంధం దాకా తీసుకువచ్చింది. తీరా నిజం తెలుసుకున్న భర్త ఆమెను మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ అవేమీ ఫలించకపోవడంతో.. ఇక లాభం లేదని విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Image result for tik tok girls indian

పూర్తి వివరాల్లోకి వెళితే… వేలూరుకి చెందిన ఓ మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె భర్త ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. తొలుత భార్య,బిడ్డలను ఆమె ప్రేమగానే చూసేది. అయితే.. ఎప్పుడైతే టిక్ టాక్ అలవాటు అయ్యిందో అప్పటి నుంచి వాళ్లను పట్టించుకోవడం మానేసింది.రోజూ అందంగా ముస్తాబై టిక్ టాక్ లో వీడియోలు చేసేది. వాటికి లైకులు, కామెంట్స్ రావడంతో వాటిని చూసి మురిసిపోయేది. ఈమె వీడియోలను చూసి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ పరిచయం కాస్త చివరకు వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ క్రింది వీడియో చూడండి

భార్యపై అనుమానం వచ్చిన భర్త ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా టిక్‌టాక్‌కు బానిసైనట్టు గమనించారు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని గమనించాడు. వీటిపై పలు మార్లు భార్యను ఖండించినప్పటికీ వినలేదు. వేలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించారు.సదరు మహిళకు, ఆమె టిక్ టాక్ ప్రియుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరూ కలుసుకోవద్దని.. మాట్లాడుకోవద్దని మంచిగా చెప్పి చూశారు. అయినా వారిలో ఎలాంటి మార్పులేదు. దీంతో.. ఆమె భర్త ఇక భార్యకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఈమేరకు ఆమెకు ఇప్పటికే నోటీసులు కూడా పంపినట్లు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation