రష్యా లాక్‌డౌన్.. నగరాల్లోకి సింహాలను వదిలారా?

131

ప్రపంచ దేశాలన్నీ దాదాపు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. త్వరలో ఇండియాలోని అన్ని జిల్లాల్లో కూడా లాక్‌డౌన్ విధించడం ద్వారా కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నించనున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఎవరూ పట్టించుకోకుండా వీధుల్లోకి వస్తున్నారు. వీరిని నియంత్రించడానికి పలు దేశాలు కఠిన నియమాలను అమలు చేస్తున్నాయి. బలమైన కారణం లేకుండా బయట అడుగుపెట్టే వాళ్లను జైలుకు పంపడం లేదా జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకొంటోంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఈ విషయంలో రష్యా చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, ప్రజల బయట అడుగుపెట్టకుండా ఉండేందుకు నగరాల్లోకి సింహాలను వదిలారనే వార్త దావనంలా వ్యాపించింది. దీంతో నెటిజనులు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాగే చేయాలని, అప్పుడు ప్రజలు మాట వింటారంటూ బోలెడన్నీ మెసేజులు, మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ రష్యాలో సింహాలను వదిలిన మాట నిజమేనా? నగర వీధుల్లో తిరుగుతున్న ఆ సింహం ఫొటో రష్యాలోనిదేనా? ఈ ఫొటో వెనుక దాగిన వాస్తవం ఏమిటీ?నాసిర్ చిన్యోటీ అనే ట్విట్టర్ యూజర్ ఆదివారం ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఒక వైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, మరోవైపు ఓ పార్కింగ్ ప్లేసులో తిరుగుతున్న సింహం ఫొటోతో చేసిన ట్వీట్‌లో.. ‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ ప్రజలకు రెండే ఆప్షన్లు ఇచ్చారు. రెండు వారాలు ఇంట్లో ఉండండి. లేదా బయటకు వచ్చి ఐదేళ్లు జైల్లో ఉండండి’’ అని రాశాడు. దాని కింద ‘‘ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు 800 పులులు, సింహాలను దేశమంతా వదిలిపెట్టారు’’ అని పేర్కొన్నాడు. దీంతో ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఏ వాట్సాప్, ఫేస్‌బుక్, హెలో పోస్టు చూసినా ఈ చిత్రమే కనిపిస్తోంది.
ఈ ఫొటో ట్వీట్ చేసిన వ్యక్తి ప్రొఫెల్‌లో కమెడియన్ అని ఉంది. ఈ ట్వీట్ కింద ఓ వ్యక్తితో ఇది జోక్ మాత్రమేనని తెలిపాడు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

Content above bottom navigation