గాలి ద్వారా కరోనా వస్తుందా?… ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వివరణ

120

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన 10 లక్షల మందికి పైగా పడ్డారు. అందులో 53వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం ముందుగానే దేశవ్యాప్తంగా 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే కంటికి కనిపించని ఈ వైరస్ ఒంట్లోకి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అయితే తాజాగా ఓ షాకింగ్ సమాచారం తెలిసింది. ఈ సమాచారం ప్రకారం కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Coronavirus update: 565 deaths, more than 28,000 cases worldwide ...

మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ అనేది ఎవరికైనా వ్యాపిస్తే వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, అతని ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లలో కరోనా వైరస్ ఉంటుందని కూడా మనకు తెలుసు. అలాగే ఆ వ్యక్తి ముట్టుకున్న వస్తువుల్ని ఇతరులు ముట్టుకుంటే ఆ వస్తువులపై చేరిన వైరస్, ఇతరులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇది కూడా మనకు తెలుసు. ఐతే ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా అన్న అంశంపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. దీనిపై చాలా మందికి అనుమానాలు ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. వైరస్ ఉండే తుంపల్లు గాలిలో ప్రయాణిస్తాయనీ, ఐతే గాలిలో ఈ వైరస్ ఎక్కువ సేపు బతకదని తెలిపింది. ఐతే తుంపర్లు వైర్వేరు సైజులలో ఉంటాయని తెలిపింది. కరోనా ఉన్న వ్యక్తి తుమ్మే, దగ్గే వ్యక్తి పక్కన నిలబడే వారిపై తుంపర్లు పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

ఐతే గాలి ద్వారా వైరస్ వ్యాపించదు అని మాత్రం WHO చెప్పట్లేదు. చైనాలో 75465 మంది కరోనా పేషెంట్లను చెక్ చెయ్యగా వారిలో ఒక్కరికి కూడా గాలి ద్వారా వైరస్ వ్యాపించినట్లు తేలలేదు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా కంటే ఇతర మార్గాల్లోనే వైరస్ ప్రబలే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోమంటోంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందేమోనన్న టెన్షన్ పెట్టుకోకుండా తగిన జాగ్రత్తలు పాటించమని సూచిస్తోంది. అలాగే పాల ప్యాకెట్స్ వలన కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. పాల ప్యాకెట్ అనేది ప్లాస్టిక్ వలన తయారవుతుంది. ప్లాస్టిక్ మీద వైరస్ 72 గంటలు బతికే ఉంటుంది. కాబట్టి పాల ప్యాకెట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Content above bottom navigation