దోమ కాటుతో కరోనా వైరస్ వ్యాపిస్తుందా?

132

కరోనా వైరస్…ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గజగజవణికిస్తున్న ప్రాణాంతక వైరస్. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటి వరకు 125 దేశాలకు వ్యాపించింది. చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్‌తో పాటు పలు దేశాల్లో జనం పిట్టల్లా రాలుతున్నారు. చైనాలో కొత్త కేసులు తగ్గితున్నప్పటికీ చైనా బయట వేగంగా విజృంభిస్తోంది కరోనా వైరస్. చాలాచోట్ల వ్యాపారాలు, స్కూళ్లు, కాలేజీల మూతపడ్డాయి. క్రీడా, రాజకీయ కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. కరోనా పడగ విప్పడంతో విమానయానం, పర్యాటక రంగం, పౌల్ట్రీ, సినీ పరిశ్రమలు కుదేలయ్యాయి. ఏకంగా ఆర్థికవ్యవస్థలే కుప్పకూలుతున్నాయి. ప్రపంచాన్ని ఇంతలా పట్టి పీడిస్తున్న ఈ వైరస్‌ను చూసి ప్రజలు భయపడిపోతున్నారు. తమ్ములు, దగ్గు ఉంటే కరోనా సోకిందేమోనని వణికిపోతున్నారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

Why Do Mosquitoes Bite Me So Much? | Terminix

ఇక కరోనా వైరస్ గురించి పలు కథనాలు వెలువడుతున్నాయి. వీటిలో నిజాలకంటే…అసత్యాలే ఎక్కువగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి పలు రకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి.తాజాగా దోమల కాటుతో కరోనా వైరస్ సోకుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ కథనాలను వైద్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. దోమల కాటుతో కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టంచేస్తున్నారు. దోమకాటుతో ఈ వైరస్ వ్యాపించదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టంచేసింది. శ్వాసకోసకు సంబంధించిన వైరస్ ఇది. దగ్గులు, తుమ్మలు, లాలాజలం ద్వారా బాధిత వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. కరోనా వ్యాధి లక్షణాలును తెలుసుకుంటే ఆ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు. ఆ మహమ్మారి బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

మరి కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే.. కరోనా వైరస్ సోకిన వారిలో ముందుగా జలుబు లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, కండరాల నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని కరోనా పరీక్షా కేంద్రానికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవాలి. కరోనా సోకిన తర్వాత చికిత్స అందకపోతే తీవ్రమైన న్యుమోనియాకు దారితీస్తుంది. కిడ్నీ సహా పలు కీలక అవయవాలు విఫలమై ప్రాణాలు పోయే ప్రమాదముంది.చలికాలతో పాటు శీతల ప్రాంతాల్లో కోవిడ్-19 వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా.. తుంపర్ల రూపంలో వైరస్ బయటకు వస్తుంది. అలా ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్‌కు మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉంది. ఇక కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే.. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఇతరులను తాకకూడదు. ఇతరులను షేక్ హ్యాండ్‌ కాకుండా నమస్కారంతో పలకరించాలి. రద్దీ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచింది. బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలి. ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను నేరుగా తాకరాదు. రోజుకు పలు మార్లు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదావేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు కూడా ఒకరికొకరు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చలి వాతావరణంలో అస్సలు ఉండకూడదు.పెంపుడు జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. కరోనావైరస్‌కు ప్రస్తుతం ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. అడ్డుకోగలిగిన వ్యాక్సీన్‌ కూడా తయారుచేేయలేదు. శాస్త్రవేత్తలు ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. కనీసం ఏడాదిన్నర, రెండేళ్లు పట్టవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నివారణే మనముందున్నమార్గం. కరోనా బారిన పడకుండా ఉండడమే అతి పెద్ద చికిత్సామార్గం.

Content above bottom navigation